Australian Open : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పెను సంచలనం నమోదైంది. నంబర్ వన్ క్రీడాకారిణి ఇగ స్వియటెక్ (పోలాండ్) టోర్నీ నుంచి నిష్క్రమించింది. నిరుడు వింబుల్డన్ ఛాంపియన్ అయిన ఎలెనా రిబాకినా (కజకిస్థాన్) చేతిలో పరాజయం పాలైంది. 4వ రౌండ్ మ్యాచ్‌లో 6-4, 6-4తో వరుస సెట్లలో రిబాకినా ఆధిపత్యం చెలాయించింది.
వామప్కి ఎక్కువ సమయం తీసుకొని మ్యాచ్ ప్రారంభించడంతో స్వియట్కెను అంపైర్ మందలించాడు. దాంతో ఒత్తిడికి లోనైన ఆమె పుంజుకొని 2-2తో స్కోర్ సమయం చేసింది. కానీ, పట్టు వదలని రిబాకినా తొలి సెట్‌ను 6-4తో గెలిచింది. రెండో సెట్లో ఈ టాప్ సీడ్ ప్లేయర్ 3-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే.. అనూహ్యంగా రిబాకినా స్కోర్ 3-3తో స్కోర్ సరి చేసింది. ఆ తర్వాత మ్యాచ్‌పై పట్టు విడవకుండా 6-4తో విజేతగా నిలిచింది. దాంతో టాప్ సీడ్ స్వియటెక్ ఇంటిదారి పట్టింది. తర్వాతి రౌండ్లో రిబాకినా, లాథ్వియాకు చెందిన జెలెనా ఓస్టాపెంకోతో తలపడనుంది. జెలెనా నాలుగో రౌండ్లో అమెరికాకు చెందినయంగ్స్టర్ కొకో గౌఫ్పై 7-6, 5-3తో గెలుపొందింది.