HomeSportsAustralia Vs West Indies Highlights 1st Test Day 1
పేసర్ల ప్రతాపం
పేసర్లు సత్తాచాటడంతో వెస్టిండీస్‌తో బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో ఆస్ట్రేలియా మంచి స్థితిలో నిలిచింది. కమిన్స్ (4/41), హజిల్‌వుడ్ (4/44) ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకు ఆలౌటైంది. మెకంజీ (50) ఒక్కడే అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.
వెస్టిండీస్ 188 ఆలౌట్
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు
అడిలైడ్: పేసర్లు సత్తాచాటడంతో వెస్టిండీస్‌తో బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో ఆస్ట్రేలియా మంచి స్థితిలో నిలిచింది. కమిన్స్ (4/41), హజిల్‌వుడ్ (4/44) ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకు ఆలౌటైంది. మెకంజీ (50) ఒక్కడే అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కంగారూలు ఆట ముగిసే సమయానికి 59/2తో నిలిచారు. వార్నర్ టెస్టులకు వీడ్కోలు పలకగా.. అతడి స్థానంలో స్టీవ్ స్మిత్ ఓపెనర్ అవతారమెత్తాడు. ఉస్మాన్ ఖవాజా (30), కామెరూన్ గ్రీన్ (6) క్రీజులో ఉన్నారు.