Tim Paine | క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్
ఆస్ట్రేలియా (Australia) మాజీ కెప్టెన్ టిమ్ పైన్ (Tim Paine) అంతర్జాతీయ క్రికెట్‌కు ఈరోజు వీడ్కోలు పలికాడు. అతను టాస్మానియా తరఫున క్వీన్స్లాండ్ జట్టుతో తన ఆఖరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. 38 ఏళ్ల పైన్ 23 టెస్టుల్లో ఆసీస్ సారథిగా వ్యవహరించాడు.
Tim Paine : ఆస్ట్రేలియా (Australia) మాజీ కెప్టెన్ టిమ్ పైన్ (Tim Paine) అంతర్జాతీయ క్రికెట్‌కు ఈరోజు వీడ్కోలు పలికాడు. అతను టాస్మానియా తరఫున క్వీన్స్లాండ్ జట్టుతో తన ఆఖరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. 38 ఏళ్ల పైన్ 23 టెస్టుల్లో ఆసీస్ సారథిగా వ్యవహరించాడు. కెరీర్లో 35 టెస్టులు ఆడాడు. ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు 46వ కెప్టెన్‌గా పైన్ సేవలందించాడు. స్టీవ్ స్మిత్ (Steve Smith) తర్వాత పైన్ ఆసీస్ టెస్టు సారథిగా ఎంపికయ్యాడు.
2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా స్మిత్‌ను కెప్టెన్సీ నుంచి క్రికెట్ ఆస్ట్రేలియా తప్పించింది. మూడేళ్లు కెప్టెన్‌గా కొనసాగాడు. అయితే. టాస్మానియా మాజీ క్రికెట్ ఉద్యోగికి అసభ్యకరమైన సందేశాలు పంపాడనే ఆరోపణలు రావడంతో 2021లో పైన్ కెప్టెన్‌గా తప్పుకున్నాడు.
పాకిస్థాన్‌పై ఆరంగేట్రం
హబర్ట్లో పుట్టిన పైన్ 18 ఏళ్ల పాటు టాస్మానియా జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. కెరీర్లో మొత్తంగా 153 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. అతను 2010లోఅంతర్జాతీయ క్రికెట్లో ఆరంగేట్రం చేశాడు. లార్డ్స్‌లో పాకిస్థాన్‌పై తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. వికెట్ కీపర్‌గా 157 మంది బ్యాటర్లను ఔట్ చేశాడు. అంతేకాదు 35 వన్డేలు కూడా ఆడాడు.
బేబీ సిట్టర్ వివాదం
భారత జట్టు 2019లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు పైన్, రిషభ్ పంత్ మధ్య మాటల యుద్ధం నడిచింద. పంత్ నువ్వు బేబీ సిట్టర్‌గా ఉంటావా? నేను నా భార్యను సినిమాకు తీసుకెళ్తాను. నా పిల్లలను చూస్తావా? అంటూ పైన్, పంత్‌ను స్లెడ్జింగ్ చేశాడు. అందుకు పంత్ కూడా ఘాటుగానే బదులిచ్చాడు. తాత్కాలిక కెప్టెన్‌ను ఎప్పుడైనా చూశారా? అని ఆసీస్ కెప్టెన్ ఉద్దేశించి అన్నాడు. సిరీస్ సమయంలోనే పైన్ భార్య బోనీ పైన్ పంత్ తమ పిల్లలను ఎత్తుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోకు బెస్ట్ బేబీ సిట్టర్ అని క్యాప్షన్ రాసింది.
ఇవి కూడా చదవండి
Delhi Capitals – Satya Nadellla | అమెరికా టీ20 లీగ్.. సత్య నాదేళ్ల టీమ్‌తో జట్టు కట్టిన ఢిల్లీ క్యాపిటల్స్
ఢిల్లీ కెప్టెన్‌గా వార్నర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

