తడబడ్డ వెస్టిండీస్.. ఆస్ట్రేలియా ముందు మోస్తరు టార్గెట్

AUSvsWI | టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్లు విజృంభించారు. భారీ స్కోర్ చేయకుండా వెస్టిండీస్‌ను ఆసీస్ బౌలర్లు అడ్డుకున్నారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి వెస్టిండీస్ 157 పరుగులకే పరిమితమైంది. ఆసీస్‌కు 158 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ బ్యాటర్లు ఆరంభంలో అదరగొట్టారు. కేవలం రెండు ఓవర్లలోనే 24 పరుగులు చేశారు. ఇక మూడో ఓవర్లో రెండో బంతికి క్రిస్ గేల్ ( 15)ను కమిన్స్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అప్పటి నుంచి పరుగులు చేయడంలో వెస్టిండీస్ ప్లేయర్లు పూరన్ ( 4), రోస్టన్ ( 0), ఎవిన్ లూయిస్ ( 29), హిట్మెయిర్ (27) తడబడ్డారు. ఫలితంగా 100 పరుగుల లోపే 5 వికెట్లను కోల్పోయింది. దీంతో పొలార్డ్ (44) తో కలిసి బ్రావో (12) వెస్టిండీస్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఇద్దరూ స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్‌కు చేరారు. ఆఖరల్లో రస్సెల్ ( 18) రెండు బంతులను సిక్సర్లు బాదడంతో వెస్టిండీస్ ఓ మోస్తరు స్కోర్ అయినా చేయగలిగింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anant Singh | ‘నితీశ్ కుమార్ వెళ్లిపోయారు, జేడీయూ కూడా అంతే’.. బహిష్కరణ తర్వాత అనంత్ సింగ్
Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్ .. దక్షి, శాలిని ఔట్, రెమ్యునరేషన్ వివరాలు వైరల్!
DK Shivakumar | కన్నడ యువతకు ఉద్యోగాలివ్వకపోతే చర్యలు కఠినంగుంటాయ్ : డీకే శివకుమార్
Gummadi Narsaiah | కరువుపై ప్రకటనలేనా.. సహాయక చర్యలేవీ? : గుమ్మడి నర్సయ్య
Rakesh Reddy | నిరుద్యోగ, విద్యారంగ సమస్యలపై పోరాడిన చరిత్ర రాకేష్ రెడ్డిది.. ప్రచారంలో బీఆర్ఎస్ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

