AUS vs WI | టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా 158 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా దూకుడుగా ఆడుతోంది. పవర్ ప్లే ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (40), మిచెల్ మార్ష్ (3) క్రీజులో ఉన్నారు. అంతకుముందు నాలుగో ఓవర్లో వెస్టిండీస్ బౌలర్ అకీస్ హోసెయిన్ వేసిన బంతికి ఓపెనర్ పింఛ్ (9) ఔటయ్యాడు.