Asian U- 20 Championship : ఆసియా అండర్ 20 చాంపియన్‌షిప్‌లో పోల్ వాల్టర్ సునీల్ కుమార్(Sunil Kumar) సంచలనం సృష్టించాడు. డెకాథ్లాన్ (decathlon) పోటీల్లో భారత్‌కు తొలి స్వర్ణం అందించాడు. పది రకాల పోటీల్లో 19 ఏళ్ల సునీల్ ఫైనల్లో 7,003 పాయింట్లు సాధించాడు. అతను ఫైనల్లో నిర్వాహకులు పోల్‌వాల్ట్(pole vault) ఉపయోగించాడు. కారణం ఏంటంటే.. అతడి పోల్‌వాల్ట్‌లో సాంకేతిక సమస్యలు ఉండడంతో అతను ఆర్గనైజర్స్ నుంచి తీసుకున్నాడు.
సునీల్ 100 మీటర్ల హర్డిల్స్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో పోటీల్లో సత్తా చాటాడు. ఫైనల్లో పోల్‌వాల్ట్ పోటీలో నాలుగో స్థానంలో నిలిచాడు. మొత్తంగా అత్యధిక పాయింట్లతో అతను బంగారు పతకం అందుకున్నాడు. మహిళల విభాగంలో పూజ వెండి పతకం సాధించింది. ఆమె హై జంప్‌లో 1.82 మీటర్ల ఎత్తు దుమికింది. బుష్రా ఖాన్ 3000మీటర్ల రేసులో సిల్వర్ మెడల్ గెలిచింది.