Ravichandran Ashwin | అవమానం వల్లే వీడ్కోలు.. అశ్విన్ అనూహ్య రిటైర్మెంట్పై వివాదం
భారత దిగ్గజ స్పిన్నర్ అశ్విన్ అనూహ్య రిటైర్మెంట్పై వివాదం నెలకొన్నది. గబ్బా టెస్టు ముగిసిన వెంటనే తన సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్ క్లబ్ క్రికెట్లో కొనసాగుతానని ప్రకటించాడు. అయితే అవమానాల వలే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చిందని అతని తండ్రి రవిచంద్రన్ పేర్కొన్నాడు.
- అశ్విన్ తండ్రి మాటలు వివాదాస్పదం
- దిద్దుబాటుకు దిగిన స్పిన్నర్
Ravichandran Ashwin | చెన్నై: భారత దిగ్గజ స్పిన్నర్ అశ్విన్ అనూహ్య రిటైర్మెంట్పై వివాదం నెలకొన్నది. గబ్బా టెస్టు ముగిసిన వెంటనే తన సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్ క్లబ్ క్రికెట్లో కొనసాగుతానని ప్రకటించాడు. అయితే అవమానాల వలే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చిందని అతని తండ్రి రవిచంద్రన్ పేర్కొన్నాడు. మీడియాతో మాట్లాడుతూ ‘అశ్విన్..వీడ్కోలు పలుకుతున్న విషయం నాకు ఆఖరి నిమిషంలో తెలిసింది అతని రిటైర్మెంట్ వెనుక చాలా కారణాలు ఉండే ఉంటాయి.
అవమానాలు వల్లే అతను ఈ నిర్ణయానికి వచ్చి ఉండచ్చు. ఎవరైనా ఎన్ని రోజులు అవమానాలు ఎదుర్కొంటారు’ అని అన్నాడు. ఇది ఆ నోటా..ఈ నోటా అన్నట్లు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో అశ్విన్ దిద్దుబాటు చర్యలకు దిగాడు. ‘నా తండ్రికి మీడియాతో ఎలా మాట్లాడాలో తెలియదు. అతని మాటాలను మీరు సీరియస్‌గా తీసుకోకండి. తండ్రుల మాటాలను మీడియా పరిగణనలోకి తీసుకుంటుందని అసలు ఊహించలేదు. జరిగిన తప్పిదాన్ని మన్నించి అతన్ని ఒంటరిగా వదిలేయండి’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. ఇదిలా ఉంటే గబ్బా టెస్టు ముగిసిన తర్వాత స్వదేశానికి బయల్దేరిన అశ్విన్..గురువారం ఉదయం చెన్నైకి చేరుకున్నాడు. ఇంటి దగ్గర భారీ సంఖ్యలో అభిమానులు అశ్విన్‌కు స్వాగతం పలికారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

