శాంటియాగో : అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ అంతర్జాతీయ గోల్స్‌లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మంగళవారం కురకావో జట్టుతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మూడు గోల్స్ చేసిన మెస్సీ అర్జెంటీనా తరఫున వంద గోల్స్‌ను సాధించాడు. కరీబియన్ దీవులకు చెందిన కురకావో జట్టును అర్జెంటీనా 7-0తో చిత్తుగా ఓడించింది.
35 ఏళ్ల మెస్సీ 20వ నిమిషంలో అర్జెంటీనాకు తొలి గోల్ సాధించడమేగాక అంతర్జాతీయ మ్యాచ్‌లలో తన వందో గోల్‌ను నమోదు చేశాడు. జాతీయ జట్టు తరఫున అత్యధిక అంతర్జాతీయ గోల్స్ సాధించిన వారిలో మెస్సీ.. పోర్చుగల్‌కు చెందిన క్రిస్టియానో రొనాల్డో(122), ఇరాన్‌కు చెందిన అలీ(109) తరువాత మూడో స్థానంలో ఉన్నాడు.