న్యూఢిల్లీ: భారత యువ మహిళా స్విమ్మర్ ఆపేక్ష ఫెర్నాండెజ్ ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత అమ్మాయిగా రికార్డుల్లోకెక్కింది.
పెరు రాజధాని లిమాలో జరుగుతున్న స్విమ్మింగ్ పోటీల్లో ఆపేక్ష 200 మీటర్ల బటర్‌ఫ్లై విభాగం ఫైనల్లో 2ని.19.14సె.లో గమ్యాన్ని చేరి ఓవరాల్‌గా ఎనిమిదో స్థానంలో నిలిచింది. కాగా అంతకుముందు హీట్స్‌లో 2ని.18.18సె. టైమింగ్ నమోదు చేసిన ఆపేక్ష ఉత్తమ భారత మహిళా స్విమ్మర్‌గా రికార్డులకెక్కింది.