న్యూయార్క్: ఉత్కంఠగా సాగుతున్న వరల్డ్‌కప్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం రాజకీయ దుమారానికి తెరతీసింది. తమ దేశ ఆటగాడి రెడ్‌కార్డ్ విషయంలో ట్రంప్.. ఫిఫా చీఫ్ గియాని ఇన్ఫాంటినోకు ఫోన్ చేయడం దీనికి కారణమైంది. ట్రంప్ కల్పించుకోవడమే ఆలస్యం అమెరికా స్టార్ ఆటగాడు ఫొలారిన్ బలోగన్‌కు ఇచ్చిన రెడ్ కార్డ్‌ను ఫిఫా విత్‌డ్రా చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బోస్నియాతో జరిగిన గత మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాడి కాలును తొక్కడంతో ఫొలారిన్కు రిఫరీ రెడ్ కార్డ్ చూపించాడు. ఈ లెక్కన బెల్జియంతో సోమవారం ఉదయం జరిగే క్వార్టర్స్‌కు ఫొలారిన్ దూరం అవ్వాలి. అయితే, అతను ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి ప్లేయర్ కాలు తొక్కలేదని కొందరు.. కావాలనే చేశాడని మరికొందరు అంటున్నారు. దీనిపై ట్రంప్ నేరుగా జోక్యం చేసుకొని ఫిఫా చీఫ్‌కు ఫోన్ చేశారు. రెడ్కార్డ్పై పునరాలోచన చేయాలని కోరగా ఫిఫా రెడ్‌కార్డ్‌ను రద్దు చేసింది. ఈ నిర్ణయంపై యూరోపియన్ ఫుట్‌బాల్ దేశాల సమాఖ్య (యూఈఎఫ్ఏ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, రెడ్‌కార్డ్ రద్దు చేసి ఫిఫా హద్దు దాటిందని విమర్శించింది.