Cristiano Ronaldo | రొనాల్డో ఎఫెక్ట్.. ఇన్‌స్టాలో సౌదీ క్లబ్‌కు అరకోటికి పైగా ఫాలోవర్స్
ఇన్‌స్టాగ్రామ్‌లో రొనాల్డోను 52 కోట్ల మందికి పైగా ఫాలోవర్స్
Cristiano Ronaldo : పోర్చుగల్ ఫార్వర్డ్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. సోషల్‌మీడియాలో పాపులర్ ఆయిన రొనాల్డోతో ఈమధ్యే సౌదీ అరేబియాకు చెందిన అల్ నస్రి క్లబ్ భారీ ఒప్పందం చేసుకుంది. తమ క్లబ్ జెర్సీ పట్టుకున్న రొనాల్డో ఫొటోను ఆన్లైన్లో పెట్టింది. దాంతో కొన్ని గంటల్లోనే సోషల్‌మీడియాలో ఆ క్లబ్ పేజీని ఫాలో అయ్యేవాళ్ల సంఖ్య అమాంతం పెరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అల్ నస్రి క్లబ్‌కు అరకోటి(6.2 మిలియన్)కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. రొనాల్డోతో ఒప్పందానికి ముందు ఆ క్లబ్ ఫాలో అవుతున్నవాళ్ల సంఖ్య 8లక్షల మంది మాత్రమే. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో రొనాల్డోను 52 కోట్ల మంది (527 మిలియన్)కి పైగా ఫాలో అవుతున్నారు. సోషల్‌మీడియాలో అత్యధిక మంది అభిమానులు ఉన్న ఆటగాడిగా రొనాల్డో రికార్డు క్రియేట్ చేశాడు.
అల్ నస్రి క్లబ్ ఈమధ్యే రొనాల్డోతో 214 మిలియన్ డాలర్ల కాంట్రాక్టు కుదుర్చుకుంది. దాంతో రొనాల్డో ఏడాదికి 17వందల కోట్లు ఆర్జించనున్నాడు. ఈ స్టార్ ఆటగాడు ఆ క్లబ్‌తో 2025 జూన్ 25వ తేదీ వరకు కొనసాగనున్నాడు. ఫిఫా వరల్డ్ కప్‌లో రొనాల్డోను కీలక మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమ్యాడు. క్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్ 0-1తో క్రొయేషియా చేతిలో ఓడిపోయింది. దాంతో, చివరి వరల్డ్ కప్ ఆడుతున్న అతను తీవ్ర నిరాశకు గురయ్యాడు. అంతేకాదు టోర్నీ ప్రారంభానికి ముందు ఇచ్చిని ఇంటర్వ్యూ కారణంగా మాంచెస్టర్ యూనైటెడ్ క్లబ్ అతనితో కాంట్రాక్టు రద్దు చేసుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

