ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఖాదిర్, చంద్రపాల్, చార్లెట్
పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్, వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం శివనారాయన్ చందర్‌పాల్, ఇంగ్లండ్ మహిళా మాజీ కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్డ్స్‌కు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది. ఈ మేరకు ఐసీసీ ఒక ప్రకటన విడుదల చేస్తూ బుధవారం సిడ్నీలో వారిని సత్కరించనున్నట్టు తెలిపింది.
దుబాయ్: పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్, వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం శివనారాయన్ చందర్‌పాల్, ఇంగ్లండ్ మహిళా మాజీ కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్డ్స్‌కు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది. ఈ మేరకు ఐసీసీ ఒక ప్రకటన విడుదల చేస్తూ బుధవారం సిడ్నీలో వారిని సత్కరించనున్నట్టు తెలిపింది. దివంగత ఖాదిర్.. పాకిస్థాన్ తరఫున 67 టెస్టులు(236 వికెట్లు), 104 వన్డే(132 వికెట్లు)లలో ప్రాతినిధ్యం వహించాడు. 164 టెస్టులు, 268 వన్డేలు ఆడిన చందర్‌పాల్ టెస్టులలో అత్యధిక పరుగులు(11,867) సాధించిన వారిలో 8వ స్థానంలో నిలిచాడు. అంతేగాక 8 వరుస ఇన్నింగ్స్‌లలో అర్ధసెంచరీలు సాధించిన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. చార్లెట్ ఎడ్వర్డ్స్ 2009లో ఇంగ్లండ్‌కు వన్డే, టీ20 ప్రపంచకప్‌లను అందించింది. రిటైరయ్యే నాటికి ఆమె వన్డేలు, టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్‌గా వినతికెక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

