Jensi Kanabar | భారత టెన్నిస్‌లో జెన్సీ సంచలనం.. సానియా మిర్జా ‘ఆల్‌టైమ్ రికార్డు’ బ్రేక్..!
Jensi Kanabar : భారత టెన్నిస్‌లో కొత్త తార దూసుకొచ్చింది. మహిళల సింగిల్స్‌లో టెన్నిస్‌లో జెన్సీ కనబర్ (Jensi Kanabar) చరిత్రాత్మక విజయం సాధించింది.
Jensi Kanabar : భారత టెన్నిస్‌లో కొత్త తార దూసుకొచ్చింది. మహిళల సింగిల్స్‌లో టెన్నిస్‌లో జెన్సీ కనబర్ (Jensi Kanabar) చరిత్రాత్మక విజయం సాధించింది. ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ మహిళల టెన్నిస్‌లో దుమ్మురేపిన జెన్సీ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తద్వారా ప్రొఫెషన్ టెన్నిస్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన అతి చిన్న వయస్కురాలిలైన భారతీయురాలిగా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించింది. 14 ఏళ్ల 5 నెలల వయసులోనే ఈ ఘనత సొంతం చేసుకున్న జెన్సీ లెజెండ్ సానియా మిర్జా(Sania Mirza) రికార్డును అధిగమించింది.
సరిగ్గా 25 ఏళ్ల క్రితం సానియా మిర్జా ఐటీఎఫ్డబ్ల్యూలో క్వార్టర్ ఫైనల్ చేరి రికార్డు నెలకొల్పింది. అప్పటి నుంచి ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు అమె పేరిటే ఉంది. ఇన్నేళ్లుగా చెక్కుచెదరని సానియా రికార్డును జెన్సీ బద్ధలు కొట్టింది. రెండో అంతర్జాతీయ టోర్నమెంట్‌లోనే సత్తా చాటిన తను… 16వ రౌండ్లో సందీప్తి సింగ్ రావును 6-3, 7-5తో ఓడించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.
At 14 years 5 months, Junagarh’s 🇮🇳 Jensi Dipakbhai Kanabar breaks Sania Mirza’s 25-year old record of being the youngest Indian female to reach the quarter-final of a pro singles event
Playing in only her 2nd ITF event, Jensi saved 4 set points in the 2nd set to oust 22 year… pic.twitter.com/2BmHSketav
— Indian Tennis Daily (ITD) (@IndTennisDaily) April 30, 2026
ఈ ఏడాది ఆరంభంలోనే ఆస్ట్రేలియన్ ఓపెన్ అండర్ -14 టైటిల్ గెలుపొందిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిన జెన్సీ ఇప్పుడు సానియాను అధిగమించడం విశేషం. టీనేజ్లోనే సంచనల విజయాలతో అబ్బురపరుస్తున్న ఈ అమ్మాయి టెన్నిస్‌లో భారత మరో ఆశాకిరణంగా ఎదుగుతోంది.
చిన్న వయస్కురాళ్లు వీళ్లే..
జెన్సీ కనబర్ – 14 ఏళ్ల 5 నెలలు.
సానియా మిర్జా – 14 ఏళ్ల 5నెలల 11 రోజులు.
అంకిత బాంబ్రీ – 14 ఏళ్ల 8 నెలలు.
తారా అయ్యర్ – 5 ఏళ్ల 10 నెలలు.
ఇషా లఖానీ – 15 ఏళ్ల.
రుతుజా భొసాలే – 15 ఏళ్ల 2 నెలలు.
సనా బాంబ్రీ – 15 ఏళ్ల 2 నెలలు.
మాయా రాజేశ్వరన్ రేవతి – 15 ఏళ్ల 6 నెలలు.
శ్రుతి అహ్లావత్ – 15 ఏళ్ల 7 నెలలు.
పార్థసారథి అరుణ్ ముండే – 15 ఏళ్ల 7 నెలలు.
మహక్ జైన్ – 15 ఏళ్ల 18 నెలలు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

