తన బౌలింగ్‌తో హిట్ మ్యాన్‌ను ఫిదా చేసిన 11 ఏళ్ల కుర్రాడు..
Rohit Sharma | టీ 20 ప్రపంచ కప్ టోర్నీకోసం టీమిండియా సిద్ధమవుతోంది. తొలి మ్యాచ్ అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత జట్టు తలపడనుంది. ఇందుకోసం టీమిండియా ఇప్పటికే ప్రాక్టీస్ షురూ చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న భారత జట్టు పెర్త్ లోని వాకా స్టేడియంలో ప్రపంచ కప్ కోసం సన్నాహకాల్లో ఉంది. ఈ క్రమంలో అక్కడ 11 ఏళ్ల కుర్రాడి బౌలింగ్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఆకర్షించింది.

వాకా మైదానంలో కొందరు పిల్లలు క్రికెట్ ఆడుతూ కనిపించారు. అందులో 11 ఏళ్ల ద్రుశిల్ రోహిత్ కంటపడ్డాడు. ఎడమ చేతి వాటంతో అతడు బంతులను విసురుతున్న తీరును గమనించిన హిట్ మ్యాన్.. ఆ పిల్లాడి టాలెంట్‌కు ఫిదా అయ్యాడు. వెంటనే అతణ్ని తన దగ్గరకు పిలిచి.. నెట్స్‌లో తనకు బౌలింగ్ చేయమన్నాడు. హిట్ మ్యాన్ నుంచి పిలుపు రావడంతో ద్రుశిల్ ఎగిరి గంతేశాడు. నెట్స్‌లో టెన్నిస్ బాల్‌తో రోహిత్‌కు బౌలింగ్ చేశాడు. కుర్రాడి బౌలింగ్‌కు రోహిత్ ఫిదా అయ్యాడు.
ఈ విషయమై ద్రుశిల్ మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ నన్ను చూసి.. తనకు బౌలింగ్ చేయమని చెప్పాడు. నాకు అది ఎంతో ఆశ్చర్యం అనిపించింది. అంతకు ముందు రోజే.. నువ్వు రోహిత్ శర్మకు కూడా బౌలింగ్ చేయగలగాలి అని మా నాన్న చెప్పాడు. నేను చాలా ఎగ్జైట్ అయ్యాను’’ అంటూ ఆ పిల్లాడు సంతోషం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను బీసీసీఐ ట్విటర్లో పోస్టు చేసింది.
𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦!
When a 11-year-old impressed @ImRo45 with his smooth action! 👌 👌
A fascinating story of Drushil Chauhan who caught the eye of #TeamIndia Captain & got invited to the nets and the Indian dressing room. 👏 👏 #T20WorldCup
Watch 🔽https://t.co/CbDLMiOaQO
— BCCI (@BCCI) October 16, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!