యాషెస్ టెస్టు సిరీస్‌లో ఆసీస్ దిగ్గజ క్రికెటర్ డ్రాన్ బ్రాడ్‌మన్ రెండు ట్రిపుల్ సెంచరీలు చేశాడు. అప్పుడు వాడిన బ్యాట్‌ను తాజాగా వేలానికి ఉంచారు. ఆస్ట్రేలియాలోని బౌరల్లో ఉన్న బ్రాడ్‌మన్ మ్యూజియంలో ఈ బ్యాట్‌ను వేలం వేయనున్నారు. ఆ బ్యాట్‌పైన తన స్కోర్‌ను డాన్ స్వయంగా రాశాడు. ధర ఇంకా ఎంత అన్నది నిర్ణయించలేదు. కానీ గతంలో బ్రాడ్‌మన్ మరో బ్యాట్ 110,000 ఆస్ట్రేలియన్ డాలర్లకు (సుమారు రూ.59 లక్షలు) వేలంలో అమ్ముడైంది.