న్యూఢిల్లీ : యూట్యూబ్ వేదికగా సృజనాత్మకతతో అలరిస్తున్న క్రియేటర్లను మరింత ప్రోత్సహించేందుకు మరో కొత్త టూల్ జోడించారు. న్యూ టూల్‌తో క్రియేటర్లు తమ ఆడియన్స్ రీచ్ పెంచుకోవడంతో పాటు వారు మరింత ఎదిగేందుకు యూట్యూబ్ వెసులుబాటు కలిగించింది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ డివైజ్‌లపై ఈ న్యూ టూల్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా క్రియేటర్లు పెద్దగా ఉండే యూట్యూబ్ వీడియోలను ఎడిటింగ్ టూల్స్‌తో 60 సెకండ్ల షార్ట్ వీడియోగా కన్వర్ట్ చేసుకోవచ్చు.
యూట్యూబ్ తన సపోర్ట్ పేజ్‌లో యూజర్లు టెక్ట్స్, ఫిల్టర్స్‌ను పొందవచ్చని పేర్కొంది. ఈ అప్డేట్తో క్రియేటర్లు తమ క్లాసిక్ కంటెంట్‌కు తాజా లైఫ్‌ను అందించవచ్చని, ఆడియన్స్‌తో సరికొత్తగా ఎంగేజ్ అవచ్చని కంపెనీ పేర్కొంది. షార్ట్స్ కెమెరాతో అదనపు వీడియోలను షూట్ చేసుకోచ్చని, ఆ గ్యాలరీ నుంచి 60 సెకండ్లలోపు వీడియో పార్ట్‌ను ఎంచుకుంటే మరిన్ని వీడియోలను అప్లోడ్ చేయవచ్చని పేర్కొంది.
ఎడిటింగ్ స్క్రీన్‌లో వీడియో సెగ్మెంట్‌ను ఎంచుకున్న తర్వాత షార్ట్స్ కోసం గ్యాలరీ వీడియోలు యాడ్ చేయడం లేదా షూట్ చేయాలనుకుంటే బ్యాక్ యారోను ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్డేట్తో విస్తృత ఆడియన్స్‌ను కంటెంట్ క్రియేటర్స్ చేరుకునే వెసులుబాటు ఉంటుందని యూట్యూబ్ పేర్కొంది.