Whatsapp | వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. త్వరలో ఈ కొత్త ఫీచర్లు..!
Whatsapp | మెసేజింగ్ యాప్ వాట్సాప్.. స్టేటస్లతోపాటు డిలిటెడ్ మెసేజ్‌లు, మరో డివైజ్‌లో లాగిన్ ఆప్షన్‌కు కొత్త ఫీచర్లు తెస్తోంది.
Whatsapp | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు తన యూజర్లకు కొత్త ఫీచర్లు అందుబాటులోకి తెస్తున్నది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వర్షన్‌తోపాటు డెస్క్‌టాప్ వర్షన్‌కూ కొత్త అప్డేట్స్ రానున్నాయి. డిలిటెడ్ మెసేజ్‌లను అన్డూ చేయడంతోపాటు నచ్చని స్టేటస్‌లపై యూజర్లు ఫిర్యాదు చేసేందుకు వీలుగా వాట్సాప్ ఆప్షన్లు తేనున్నదని తెలుస్తున్నది. మరొక డివైజ్‌లో లాగిన్ కావడానికి కోడ్ నమోదు ఫీచర్ రాబోతున్నది.
మన ఫోన్.. వాట్సాప్ కాంటాక్ట్స్ల్లో పలువురు ప్రతి రోజూ స్టేటస్లు పెడతారు. సినిమా పాటలు, కొటేషన్లు, ఫన్నీ వీడియోల వరకు ఓకే.. కొన్ని స్టేటస్లు అందరికి నచ్చవు. ఇప్పటి వరకు నచ్చని స్టేటస్‌ల గురించి వాట్సాప్‌లో ఏమీ చేయలేం. కానీ ఇక ముందు అలా కాదు.. అనుచిత స్టేటస్ గురించి వాట్సాప్ మోడరేసన్ టీమ్‌కు నివేదించొచ్చు. ప్రస్తుతం డెవలప్మెంట్ దశలో ఉన్న ఈ ఫీచర్ తొలుత డెస్క్‌టాప్ బీటా వర్షన్‌గా ఎంపిక చేసిన కొందరికి అందుబాటులోకి వస్తున్నది.
ఇక ఆండ్రాయిడ్ యూజర్లు మరో డివైజ్‌లో తమ వాట్సాప్ లాగ్ఇన్ కావాలంటే ఆర్ డిజిట్ల కోడ్ నమోదు చేయడం తప్పనిసరి అవుతుంది. మరో డివైజ్‌లో లాగిన్ కావడానికి ప్రయత్నించినప్పుడల్లా సంబంధిత యూజర్ మొబైల్‌కు ఆరు నంబర్ల వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ నమోదు చేస్తేనే మరో డివైజ్‌లో వాట్సాప్ లాగిన్ అవుతుంది. ఈ ఫీచర్ కూడా ఇప్పుడు డెవలప్మెంట్ దశలో ఉంది. తొలుత ఆండ్రాయిడ్ బీటా వర్షన్ వాడేవారికి తొలుత అందుబాటులోకి వస్తుంది.
ఇప్పుడు వాట్సాప్‌లో చాలా మంది మెసేజ్ డిలిట్ ఫీచర్ ఇష్టపడుతుంటారు. తప్పులు దొర్లిన మెసేజ్‌ను వెంటనే డిలిట్ చేయొచ్చు. కానీ, డిలిట్ ఫీచర్లో `డిలిట్ ఫర్ ఎవిరీ వన్`, `డిలిట్ ఫర్ మీ` అనే రెండు ఆప్షన్లు ఉన్నాయి. డిలిట్ ఫర్ ఎవిరీ వన్ ఫీచర్ నొక్కితే సంబంధిత యూజర్ పంపిన కాంటాక్ట్స్ అందరి ఫోన్లలో మెసేజ్ డిలిట్ అవుతుంది. అలా కాకుండా తొలుత డిలిట్ ఫర్ మీ ఆప్షన్ ఎంచుకుంటే మెసేజ్ పంపిన వారికి మాత్రమే డిలిట్ అవుతుంది.
వాట్సాప్ యూజర్లు కొన్ని సందర్భాల్లో డిలిట్ ఫర్ ఎవిరీవన్కు బదులు డిలిట్ ఫర్ మీ ఆప్షన్ నొక్కుతారు. దానివల్ల డిలిట్ ఫర్ ఎవిరీవన్ ఆప్షన్ వాడే చాన్స్ మిస్సయినట్లే. కానీ, ఇప్పుడు ఈ సమస్య పరిష్కారానికి వాట్సాప్ పూనుకున్నదని సమాచారం. ఒకవేళ పొరపాటున డిలిట్ ఫర్ మీ ద్వారా.. డిలిట్ అయిన మెసేజ్‌లను అన్డూ ఆప్షన్ ద్వారా పునరుద్ధరించుకుని.. అటుపై డిలిట్ ఫర్ ఎవిరీవన్ ఆప్షన్ వాడొచ్చు. అదే జరిగితే పలువురు యూజర్లకు ఉపయుక్తంగా ఉంటుందని సదరు ఫీచర్ డెవలపర్లు చెబుతున్నారు.
వాట్సాప్ యూజర్లు ప్రతి ఒక్కరూ స్టేటస్లు పెడతారు. వాట్సాప్ స్టేటస్లు కొందరు యూజర్లకు వెళ్లకుండా ఉండాలంటే స్టేటస్ ప్రైవసీ సెట్టింగ్స్ మార్చుకుంటారు. కానీ అలా ప్రతిసారీ మార్చుకోవడం ఇబ్బందికరమే. కానీ ఆ సమస్య తలెత్తకుండా వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొస్తున్నది. దాని ప్రకారం ముందుగానే వాట్సాప్‌లో కుటుంబం.. ఫ్రెండ్స్, ఆఫీస్ అంటూ పలు రకాల జాబితాలు రెడీ చేసుకోవచ్చు. స్టేటస్ పెడుతున్నప్పుడు ఎంచుకున్న లిస్ట్‌లోని వారికి మాత్రమే స్టేటస్ వెళుతుంది. మిగతా వారు చూడలేరు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

