WhatsApp Chats : వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ ఫీచర్ వచ్చేసింది
చాలామందికి కొత్త ఫోన్ కొన్నప్పుడు వచ్చే సమస్య ఏంటో తెలుసా? పాత ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్, చాట్, ఫోటోలు, వీడియోలు, ఇతర ఫైల్స్‌ను కొత్త ఫోన్లోకి మూవ్ చేయడం. కాంటాక్ట్స్ అంటే.. మెయిల్ ద్వారా మూవ్ చేస్తాం. ఫోటోలు, వీడియోలు అంటే.. డేటా కేబుల్ ద్వారానో లేదా ఇతర షేరింగ్ యాప్స్ ద్వారా మూవ్ చేసుకోవచ్చు. మరి.. వాట్సప్ చాట్ మూవ్ చేయాలంటే ఎలా? పాత, కొత్త ఫోన్లో సేమ్ ఓఎస్ అయితే సమస్య ఉండదు కానీ.. క్రాస్ డివైజ్ అయితేనే అసలు సమస్య. చాలామంది కొన్ని రోజులు ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతారు. ఆతర్వాత ఐఫోన్ తీసుకుంటారు.

అప్పుడు తమ వాట్సప్ చాట్, వాట్సప్‌లో ఉన్న ఫోటోలు, వీడియోలు, ఇతర డేటా మొత్తాన్ని ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్‌కు మూవ్ చేయడం కుదరదు. దానివల్ల పాత చాట్, ఇతర డేటా మొత్తం కోల్పోవాల్సి వస్తుంది. అందుకే.. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్ల మధ్య చాట్‌ను మూవ్ చేసుకునే ఆప్షన్‌ను వాట్సప్ ఎప్పుడు తీసుకొస్తుందా? అని కోట్ల మంది యూజర్లు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వాళ్ల ఎదురు చూపులు తాజాగా ఫలించాయి.
తాజాగా వాట్సప్ చాట్ మూవ్ ఫీచర్‌ను వాట్సప్ తీసుకొచ్చింది. రీసెంట్గా సామ్సంగ్ నుంచి రెండు ఫోల్డబుల్ ఫోన్లు రిలీజ్ అయ్యాయి కదా. ఆ ఫోన్లలో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ ఫేజ్‌లో ఉంది. అందుకే.. కొన్ని డివైజ్‌లలో ఈ ఫీచర్‌ను వాట్సప్ టెస్ట్ చేస్తోంది. సామ్సంగ్ నుంచి రిలీజ్ అయిన సరికొత్త మోడల్స్ అన్నింటిలో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. కానీ.. ఇతర ఆండ్రాయిడ్ డివైజ్ యూజర్లు మాత్రం ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.
సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫోన్లలో.. ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ యాప్‌కు వాట్సప్ చాట్‌ను మూవ్ చేసుకునే వెసులుబాటును వాట్సప్ కల్పించింది. త్వరలోనే.. మిగితా సామ్సంగ్ ఫోన్లకు కూడా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత… అన్ని ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని వాట్సప్ వెల్లడించింది. అయితే.. థర్డ్ స్టేజ్‌లో ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లకు వాట్సప్ చాట్‌ను మూవ్ చేసుకునే అవకాశాన్ని వాట్సప్ కల్పిస్తోంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

