Vivo V23e 5G | చైనాకు చెందని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో నుంచి వీ23ఈ 5జీ ఫోన్ తాజాగా లాంచ్ అయింది. ఇప్పటికే వివో వీ23 5జీ ఫోన్‌ను వివో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. దానితో పాటు వివో వీ23 ప్రో 5జీ ఫోన్ కూడా లాంచ్ అయింది. తాజాగా వివో వీ23ఈ 5జీ ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేశారు. ఇటీవల వేరే బ్రాండ్స్ నుంచి విడుదలైన జియోమీ 11ఐ 5జీ, లావా అగ్ని 5జీ, రియల్మీ 9 ప్రో ప్లస్ 5జీ ఫోన్లకు దీటుగా వివో వీ23ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది.
భారత్‌లో వివో వీ23ఈ 5జీ ఫోన్ ధరను రూ.25,990గా నిర్ణయించారు. నిజానికి దీని ఎంఆర్పీ ధర రూ.28,990. కానీ.. 10 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో పలు ఈకామర్స్ సైట్లలో ఈ ఫోన్‌ను రూ.25,990కే కొనుగోలు చేయొచ్చు. 8 జీబీ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో విడుదలైన ఈ ఫోన్లో రెండు కలర్స్ ఉంటాయి. మిడ్నైట్ బ్లూ, సన్‌షైన్ గోల్డ్ కలర్స్ ఉంటాయి. వివో ఇండియా ఈ స్టోర్‌లోనూ ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు.
డ్యుయల్ సిమ్(నానో), ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12, 6.44 ఇంచ్ ఫుల్ హెచ్డీ ఏఎంవోఎల్ఈడీ డిస్ప్లే, 20.9 యాస్పెక్ట్ రేషియో, ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ఎస్వోసీ, 8 జీబీ ర్యామ్, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8 ఎంపీ అల్ట్రా వైడ్ షూటర్, 2 ఎంపీ మాక్రో షూటర్, ఆటోఫోకస్ లెన్స్‌తో 44 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4050 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్స్ ఫ్లాష్ చార్జ్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ భారత్‌లో లాంచ్ అయింది.