Samsung Galaxy S23 Ultra | శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా రిలీజ్ డేట్ ఆగయా.. ఎప్పుడంటే?!
Samsung, Galaxy S23 Ultra | ఫిబ్రవరి ఒకటో తేదీన భారత్ మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా రానుంది. ఇందులో ఐసోసెల్ హెచ్‌పీ2 ఇమేజ్ సెన్సర్ ఉంటుంది.
Samsung Galaxy S23 Ultra | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్.. భారత్ మార్కెట్లోకి గెలాక్సీ ఎస్23 అల్ట్రా మోడల్ స్మార్ట్ ఫోన్‌ను ఫిబ్రవరి ఒకటో తేదీన ఆవిష్కరించనున్నది. `ఐసోసెల్ హెచ్‌పీ2 ( ISOCELL HP2 )` ఇమేజ్ సెన్సర్‌తో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఆల్ట్రా రానున్నది. ఈ ఇమేజ్ సెన్సర్‌కు 200 మెగా పిక్సెల్స్ రిజొల్యూషన్ కెపాసిటీ ఉంటుంది. వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు శాంసంగ్ తన గెలాక్సీ ఎస్23 ఆల్ట్రా మోడల్ స్మార్ట్ ఫోన్ భారీగా ఉత్పత్తి చేస్తున్నది. ఐసోసెల్ హెచ్‌పీ2 ఇమేజ్ సెన్సర్, దాని రిజొల్యూషన్ మినహా ఇతర డిటైల్స్ వెల్లడించలేదు.
ఐసోసెల్ హెచ్‌పీ2 సెన్సర్‌లో 1/1.3-అంగుళాల ఫార్మాట్‌తోపాటు 200 మిలియన్ 0.6 మైక్రో మీటర్ పిక్సెల్స్ సామర్థ్యం ఉంటుంది. 108 మెగా పిక్సెల్ స్మార్ట్ ఫోన్ కెమెరాల్లో ఈ తరహా సెన్సర్ వినియోగిస్తారు. బిగ్ కెమెరా బంప్ లేకుండా హై ఎండ్ స్మార్ట్ ఫోన్లలో హయ్యర్ రిజొల్యూషన్స్తో ఫోటోలు తీసేందుకు ఈ సెన్సర్ అనుమతిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ఫోన్లో డిఫరెంట్ లైటింగ్స్ లెవెల్స్‌లో మల్టీపుల్ పిక్సెల్ సైజ్‌లో ఫోటోలు వచ్చేలా అడ్వాన్స్డ్ పిక్సెల్-బిన్నింగ్ టెక్నాలజీ టెట్రా2 పిక్సెల్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు. లో లైట్ పరిస్థితులు ఉన్న చోట సెన్సర్ 4-16 పిక్సెల్స్‌ను 1.2-μm 50 మెగా పిక్సెల్, 2.4-μm 12.5 మెగాపిక్సెల్ ఇమేజ్ సెన్సర్లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఈ సెన్సర్ 1.2 -మైక్రాన్‌తో 50-మెగా పిక్సెల్ మోడ్‌లో అత్యధిక దృశ్యాలు క్యాప్చర్ చేస్తూ 8కే ఫుల్ వీడియో కూడా తీసేందుకు ఉపకరిస్తుంది.
ఇంకా అదనంగా ఐసోసెల్ హెచ్‌పీ2 సెన్సర్‌లో శాంసంగ్ డ్యూయల్ వెర్టికల్ ట్రాన్స్ఫర్ గేట్ (డీ-వీటీజీ) టెక్నాలజీ కూడా వినియోగించారు. దీనివల్ల పిక్సెల్ కెపాసిటీ 33 శాతానికి పైగా పెరుగుతుంది. ఎక్కువ వెలుతురు ఉన్న చోట ఓవర్ ఎక్స్పోజర్ను తగ్గించి కలర్ రీప్రొడక్షన్ను పెంచుతుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

