Samsung Galaxy S22 | సామ్సంగ్ గెలాక్సీ ఎస్22 సేల్స్ షురూ.. ధరెంతో తెలుసా?
అమెజాన్, సామ్సంగ్ వెబ్సైట్, ఇతర ఆఫ్‌లైన్ రిటైల్ ఔట్‌లెట్స్‌లో సామ్సంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్‌ను కొనుగోలు చేయొచ్చు. హెచ్డీఎఫ్సీ
Samsung Galaxy S22 | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం సామ్సంగ్ నుంచి గెలాక్సీ సిరీస్‌లో ఎస్22 సిరీస్ ఇటీవలే లాంచ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఫోన్ల సేల్స్ ప్రారంభం అయ్యాయి. సామ్సంగ్ గెలాక్సీ ఎస్22, గెలాక్సీ ఎస్22 ప్లస్, గెలాక్సీ ఎస్22 అల్ట్రా ఫోన్ల సేల్స్ ప్రారంభం అయ్యాయి. స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 ఎస్వోసీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో ఈ ఫోన్లు పనిచేయనున్నాయి.
సామ్సంగ్ గెలాక్సీ ఎస్22 మోడల్లో బేసిక్ మోడల్ 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర రూ.72,999గా నిర్ణయించారు. 8 జీబీ వేరియంట్ ధర రూ.76,999గా నిర్ణయించారు. సామ్సంగ్ గెలాక్సీ ఎస్22 ప్లస్ ఫోన్ బేసిక్ మోడల్ 8 జీబీ ధర రూ.84,999 కాగా.. 12 జీబీ వేరియంట్ ధర రూ.88,999 గా నిర్ణయించారు. సామ్సంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా ఫోన్ 12 జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్ ధర రూ.1,09,999 కాగా.. టాప్ ఎండ్ వేరియంట్ 12 జీబీ ప్లస్ 512 జీబీ వేరియంట్ ధర రూ.1,18,999గా నిర్ణయించారు.
అమెజాన్, సామ్సంగ్ వెబ్సైట్, ఇతర ఆఫ్‌లైన్ రిటైల్ ఔట్‌లెట్స్‌లో సామ్సంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్‌ను కొనుగోలు చేయొచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుల ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేస్తే రూ.8 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు.
సామ్సంగ్ గెలాక్సీ ఎస్22 ఫోన్.. ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 6.1 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 ఎస్వోసీ, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 10 ఎంపీ కెమెరా సెన్సార్ , 3700 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.
గెలాక్సీ ఎస్22 ప్లస్ ఫోన్.. 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్స్ వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ ఫీచర్లతో లాంచ్ అయింది. సామ్సంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా3.. 6.8 ఇంచ్ ఎడ్జ్ క్యూహెచ్డీ ప్లస్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 ఎస్వోసీ ప్రాసెసర్, 108 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 40 ఎంపీ కెమెరా లాంటి ఫీచర్లతో లాంచ్ అయింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

