Samsung Galaxy S22 | హైఎండ్ ఫీచర్లతో సామ్సంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ లాంచ్.. ధరెంతో తెలుసా?
సామ్సంగ్ గెలాక్సీ ఎస్22 ఫోన్లో ఆండ్రాయిడ్ 12, 6.1 ఇంచ్ ఫుల్ హెచ్డీ డైనమిక్ ఏఎంవోఎల్ఈడీ 2 ఎక్స్ డిస్ప్లే
Samsung Galaxy S22 | ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్సంగ్ నుంచి తాజాగా గెలాక్సీ ఎస్22 సిరీస్ లాంచ్ అయింది. భారత మార్కెట్లో సామ్సంగ్ గెలాక్సీ ఎస్22తో పాటు గెలాక్సీ ఎస్22 ప్లస్, గెలాక్సీ ఎస్22 అల్ట్రా ఫోన్లను విడుదల చేసింది. కంపెనీ సోషల్ మీడియా చానెల్స్ ద్వారా వర్చువల్‌గా ఎస్22 సిరీస్‌ను సామ్సంగ్ లాంచ్ చేసింది.
గెలాక్సీ అన్ప్యాక్డ్ 2022 వర్చువల్ ఈవెంట్లోనే ఈ ఫోన్లను సామ్సంగ్ లాంచ్ చేసింది. తాజాగా.. భారత విపణిలోకి ఈ ఫోన్లను తీసుకొచ్చింది. గత సంవత్సరం విడుదలైన గెలాక్సీ ఎస్21 మోడల్స్‌కు ఇవి కొనసాగింపుగా వచ్చాయి.
సామ్సంగ్ గెలాక్సీ ఎస్22 బెసిక్ మోడల్ అంటే 8జీబీ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.72,999గా నిర్ణయించారు. 8 జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్ ధర రూ.76,999గా నిర్ణయించారు. సామ్సంగ్ గెలాక్సీ ఎస్22 ప్లస్ 8 జీబీ ప్లస్ 128 జీబీ మోడల్ ధర రూ.84,999 కాగా.. 256 జీబీ వేరియంట్ ధర రూ.88,999గా ఉంది.
సామ్సంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రాలో 12 జీబీ ప్లస్ 256 జీబీ మోడల్ ధర రూ.1,09,999గా ఉంది. 12 జీబీ ప్లస్ 512 జీబీ మోడల్ ధర రూ.1,18,999గా ఉంది.
సామ్సంగ్ గెలాక్సీ ఎస్22 ఫోన్లో ఆండ్రాయిడ్ 12, 6.1 ఇంచ్ ఫుల్ హెచ్డీ డైనమిక్ ఏఎంవోఎల్ఈడీ 2 ఎక్స్ డిస్ప్లే, 4 ఎన్ఎం ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 ఎస్వోసీ ప్రాసెసర్, ట్రిపుల్ రేర్ కెమెరా, 50 ఎంపీ రేర్ కెమెరా, 10 ఎంపీ సెల్ఫీ కెమెరా, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి పీచర్లు ఉండనున్నాయి.
సామ్సంగ్ గెలాక్సీ ఎస్22 ప్లస్‌లో కూడా సేమ్ ఎస్22 ఫీచర్లే ఉంటాయి కానీ.. డిస్ప్లే మాత్రం 6.6 ఇంచులు ఉంటుంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్స్ వైర్డ్ చార్జింగ్, 15 వాట్స్ వైర్లెస్ చార్జింగ్, పవర్ షేర్ సపోర్ట్ లాంటి ఫీచర్లు ఉండనున్నాయి.
సామ్సంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రాలో 6.8 ఇంచ్ ఎడ్జ్ క్యూహెచ్డీ ప్లస్ డైనమిక్ ఏఎంవోఎల్ఈడీ డిస్ప్లే, 108 ఎంపీ రేర్ కెమెరా, 40 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్స్ వైర్డ్, 15 వాట్స్ వైర్లెస్ చార్జింగ్ ఫీచర్లు ఉండనున్నాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

