శాన్ఫ్రాన్సిస్కో : ఐఫోన్ 13 మోడల్స్ అన్నింటినీ సెప్టెంబర్‌లో ఆవిష్కరించేందుకు టెక్ దిగ్గజం యాపిల్ సన్నాహాలు చేస్తోంది. ఐఫోన్ 13 సిరీస్‌ను అప్డేటెడ్ చిప్సెట్, ఎక్స్పాండెడ్ ఎంఎం వేవ్ 5జీ సపోర్ట్‌తో పాటు భారీ బ్యాటరీలతో కస్టమర్ల ముందుకు తీసుకురానున్నట్టు తాజా నివేదిక వెల్లడించింది. సెప్టెంబర్‌లోనే ఐఫోన్ 13 మార్కెట్లోకి విడుదలవుతుందని యాపిల్ వర్గాలు వెల్లడించినట్టు పరిశోధన సంస్థ ట్రెండ్‌ఫోర్స్ పేర్కొంది.
ఇక తాజా మోడల్స్‌తో ఐఫోన్ మొత్తం సేల్స్ ఈ ఏడాది థర్డ్ క్వార్టర్లో 30 శాతం పెరుగుతాయని ట్రెండ్‌ఫోర్స్ అంచనా వేసింది. ఇక ఐఫోన్ 13 న్యూ 120హెచ్జడ్ ప్రొమోషన్ డిస్ప్లే, ప్రొరెస్ వీడియో రికార్డింగ్ వంటి అదనపు ప్రొఫెషనల్ కెమెరా ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.