Realme 9 Pro | స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్తో రియల్మీ 9 ప్రొ లాంఛ్ : ధర ఎంతంటే!
భారత్‌లో రియల్‌మి 9 ప్రొ ప్లస్, రియల్‌మి 9 ప్రొ మోడల్స్‌తో 9 ప్రొ సిరీస్‌ను కంపెనీ లాంఛ్ చేసింది. టాప్ఎండ్ ఫీచర్లతో రియల్‌మి 9 ప్రొ ప్లస్ ఖరీదైన ఫోన్‌గా ముందుకు రాగా, రియల్‌మి 8 ప్రొకు కొనసాగింపుగా మెరుగైన స్పెసిఫికేషన్స్‌తో రియల్‌మి 9 ప్రొను కంపెనీ ప్రవేశపెట్టింది.
న్యూఢిల్లీ : భారత్‌లో రియల్‌మి 9 ప్రొ ప్లస్, రియల్‌మి 9 ప్రొ మోడల్స్‌తో 9 ప్రొ సిరీస్‌ను కంపెనీ లాంఛ్ చేసింది. టాప్ఎండ్ ఫీచర్లతో రియల్‌మి 9 ప్రొ ప్లస్ ఖరీదైన ఫోన్‌గా ముందుకు రాగా, రియల్‌మి 8 ప్రొకు కొనసాగింపుగా మెరుగైన స్పెసిఫికేషన్స్‌తో రియల్‌మి 9 ప్రొను కంపెనీ ప్రవేశపెట్టింది. 5జీ కనెక్టివిటీతో రియల్‌మి 9 ప్రొ ప్రధానంగా మిడ్-ఎండ్ స్పెసిఫికేషన్స్‌పై దృష్టి కేంద్రీకరించింది. ప్రొ ప్లస్ వెర్షన్ కంటే రియల్‌మి 9 ప్రొ కస్టమర్లను ఆకట్టుకునేలా ఉంది. రియల్‌మి 9 ప్రొ కలర్ షిఫ్ట్ డిజైన్‌తో ఆకట్టుకుంటోంది.
రియల్‌మి నెంబర్ సిరీస్‌ను కస్టమర్లు విశేషంగా ఆదరిస్తున్నారని రియల్‌మి ఇండియా చీఫ్ మాధవ్ సేధ్ వెల్లడించారు. రియల్మీ నెంబర్ సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మంది యూజర్లు వాడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. రియల్‌మి 9 ప్రొ రూ 17,999 నుంచి రూ 20,999 మధ్య అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్నైట్ బ్లాక్, అరోరా గ్రీన్, సన్‌రైజ్ బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి 23 నుంచి ప్లిఫ్‌కార్ట్, రియల్‌మి ఆన్లైన్ స్టోర్, రిటైల్ స్టోర్ల నుంచి సేల్స్ ప్రారంభం కానున్నాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు, ఐఎంఐ ఫెసిలిటీ ద్వారా రూ 2000 డిస్కౌంట్ లభిస్తుందని, ఈఎంఐ వెసులుబాటు ఉంటుందని కంపెనీ వెల్లడవించింది. ఇక ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే గేమ్స్ ఆడే సమయంలో ఈ ఫోన్లో ఉండే లిక్విడ్ కూలింగ్ ఉపకరిస్తుంది. అండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మి యూఐ 3.0పై నడిచే ఈ ఫోన్ 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సర్, సూపర్ వైడ్ యాంగిల్ కెమెరా, మ్యాక్రో కెమెరా ప్రొఫెషనల్ కెమెరామెన్లనూ ఆకట్టుకుంటాయి. 33 డబ్ల్యూ చార్జింగ్ టెక్నాలజీకి 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం సపోర్ట్ చేయడంతో రియల్‌మి 9 ప్రొ దీర్ఘకాలం పనిచేస్తూ, త్వరగా చార్జింగ్ అవుతుందని కంపెనీ తెలిపింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
House Slab Collapses | కూలిన నిర్మాణంలో ఉన్న స్లాబ్.. ఒక కార్మికుడు మృతి, నలుగురికి గాయాలు
NZvIND: 4 రన్స్‌తో తేడాతో ఇండియా విజయం.. కివీస్‌తో వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యం
Rajnath Singh | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో కలసి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు..!
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం
Parking Dispute: పార్కింగ్ వివాదం.. 15 రౌండ్ల కాల్పులు.. టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

