Poco | 23న పోకో ఎఫ్4 5జీ గ్లోబల్ లాంఛ్..హాట్ ఫీచర్లు ఏంటంటే!
పోకో ఎఫ్4 5జీ జూన్ 23న గ్లోబల్ మార్కెట్లో లాంఛ్ కానుందని కంపెనీ గురువారం ప్రకటించింది. అధికారిక లాంఛ్‌కు ముందు స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్‌ను పోకో వెల్లడించింది.
న్యూఢిల్లీ : పోకో ఎఫ్4 5జీ జూన్ 23న గ్లోబల్ మార్కెట్లో లాంఛ్ కానుందని కంపెనీ గురువారం ప్రకటించింది. అధికారిక లాంఛ్‌కు ముందు స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్‌ను పోకో వెల్లడించింది. లేటెస్ట్ పోకో స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ఎస్ఓసీ చిప్సెట్తో పాటు ట్రిపుల్ రియర్ కెమెరాలు, లిక్విడ్‌కూల్ కూలింగ్ సిస్టం 2.0 వంటి హాట్ ఫీచర్లతో కస్టమర్ల ముందుకు రానుంది.
పోకో ఎఫ్4 5జీ పేరుకు తగినట్టు 5జీ సపోర్ట్‌ను కలిగిఉంది. రెండు కలర్ ఆప్షన్స్‌లో పోకో ఎఫ్4 5జీ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. పోకో ఎఫ్4 5జీ రియర్ కెమరా మాడ్యూల్ విషయానికి వస్తే ఓఐఎస్ సపోర్ట్‌తో 64 మెగాపిక్సెల్ కెమెరా సెన్సర్‌ను కలిగిఉంది.
ఐఫోన్ 12 సిరీస్ స్ఫూర్తితో ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్‌ను గమనించవచ్చు. ఇక లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోల్డ్ డిస్ప్లే, 67డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో పాటు ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 అవుటాఫ్ ది బాక్స్ ఓఎస్‌పై ఈ ఫోన్ రన్ అవుతుంది. ఇక భారత్‌లో పోకో ఎఫ్4 5జీ ధర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

