Oppo K13 Turbo | భారీ బ్యాటరీ, వాటర్ ప్రూఫ్ ఫీచర్‌తో లాంచ్ అయిన ఒప్పో కొత్త ఫోన్లు.. ధర ఎంతంటే..?
ఒప్పో సంస్థ కె13 టర్బో, కె13 టర్బో ప్రొ పేరిట రెండు నూతన స్మార్ట్ ఫోన్లను కె13 సిరీస్‌లో లాంచ్ చేసింది. ఈ ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. వీటిల్లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
Oppo K13 Turbo | ఒప్పో సంస్థ కె13 టర్బో, కె13 టర్బో ప్రొ పేరిట రెండు నూతన స్మార్ట్ ఫోన్లను కె13 సిరీస్‌లో లాంచ్ చేసింది. ఈ ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. వీటిల్లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్లలో 6.8 ఇంచుల అమోలెడ్ డిస్ప్లే ఉండగా, 1.5కె రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ డిస్ప్లేలు చాలా క్వాలిటీగా ఉంటాయి. నాణ్యమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఒప్పో కె13 టర్బో ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. కె13 టర్బో ప్రొ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ప్రాసెసర్‌ను అమర్చారు. ఈ రెండు ఫోన్లలోనూ వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, 2 మెగాపిక్సల్ సెకండరీ కెమెరాను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరా ఉంది.
భారీ బ్యాటరీ..
ఈ ఫోన్లలో 7000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీలను ఏర్పాటు చేశారు. ఇదే ఈ ఫోన్లలో ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. ఈ ఫోన్లకు గాను 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్లను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్లకు వెనుక భాగంలో ప్రత్యేకంగా కూలింగ్ ఫ్యాన్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల ఫోన్లను ఎంత తీవ్రంగా ఉపయోగించినప్పటికీ అంత ఎక్కువగా వేడికి గురి కావు. ఈ ఫోన్లకు ఐపీఎక్స్9, ఐపీఎక్స్8, ఐపీఎక్స్6 వాటర్ ప్రూఫ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్లకు ప్రత్యేకంగా టర్బో కూలింగ్ క్లిప్‌ను అందిస్తున్నారు. దీనికి ఒక బ్యాక్ కేస్ కూడా ఉంటుంది. అందులో కూలింగ్ ఫ్యాన్‌ను ఇచ్చారు. దీంతో ఫోన్లు మరింత కూల్‌గా ఉంటాయి.
రెండు వేరియెంట్లు..
ఇక ఈ ఫోన్లను సూర్యకాంతిలోనూ స్పష్టంగా వీక్షించేలా 1600 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ను అందిస్తున్నారు. ఈ ఫోన్లను 8జీబీ, 12జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఈ ఫోన్లలో లభిస్తుంది. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తోపాటు ఇన్ఫ్రారెడ్ సెన్సార్ కూడా ఈ ఫోన్లలో లభిస్తుంది. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ కూడా లభిస్తుంది. వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి, ఎన్ఎఫ్సీ వంటి అదనపు ఫీచర్లను కూడా ఈ ఫోన్లలో అందిస్తున్నారు.
ధర వివరాలు..
ఒప్పో కె13 టర్బో ఫోన్‌ను మిడ్నైట్ మావెరిక్, వైట్ నైట్ అండ్ పర్పుల్ ఫాంటమ్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేయగా, ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.27,999గా ఉంది. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.29,999గా ఉంది. ఒప్పో కె13 టర్బో ప్రొ ఫోన్‌ను సిల్వర్ నైట్, మిడ్ నైట్ మావెరిక్, పర్పుల్ ఫాంటమ్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేయగా, ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.37,999గా ఉంది. అలాగే 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.39,999గా నిర్ణయించారు. ఒప్పో టర్బో బ్యాక్ క్లిప్‌ను ఈ ఫోన్లకు గాను రూ.3,999 ధరకు అందిస్తున్నారు. ఈ ఫోన్లను ఒప్పో ఇండియా ఆన్లైన్ స్టోర్‌తోపాటు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఆగస్టు 18వ తేదీ నుంచి విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్భంగా పలు ఎంపిక చేసిన బ్యాంకులకు చెందిన కార్డులతో ఈ ఫోన్లను కొంటే రూ.3000 డిస్కౌంట్ లభిస్తుంది. 9 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని సైతం అందిస్తున్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

