OnePlus 10 Pro | అదిరిపోయే ఫోటోగ్రఫీ ఫీచర్‌తో రానున్న వన్‌ప్లస్ 10 ప్రో.. ధర ఎంతంటే?
OnePlus 10 Pro | ఇప్పటికే ఈ ఫోన్ లాంచ్ గురించి వన్‌ప్లస్ కన్ఫమ్ చేసినా.. దాని ఫీచర్లు, ధర లాంటి వివరాలను చెప్పలేదు. అయితే చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ త్వరలో
OnePlus 10 Pro | చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ త్వరలో వన్‌ప్లస్ 10 ప్రో మోడల్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్ లాంచ్ గురించి వన్‌ప్లస్ కన్ఫమ్ చేసినా.. దాని ఫీచర్లు, ధర లాంటి వివరాలను చెప్పలేదు. అయితే.. జనవరి 11న చైనాలో ముందు లాంచ్ కానున్న ఈ ఫోన్ ఫీచర్లు, ధర వివరాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

వన్‌ప్లస్ 10 ప్రోలో మూడు వేరియంట్లు ఉంటాయి. 8జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లతో ఈ ఫోన్ విడుదల కానుంది. బేసిక్ వేరియంట్ అంటే 8జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ ధర రూ.35 వేల నుంచి 40 వేల లోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 256 జీబీ వేరియంట్ అయితే రూ.46 వేల నుంచి 58 వేల లోపు ఉండొచ్చని తెలుస్తోంది.
ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. 50 ఎంపీ ఆల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 6.70 ఇంచ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటివి ఉండనున్నాయి.
ముఖ్యంగా ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్ సూపర్బ్‌గా పనిచేస్తుంది. 10 బిట్ కలర్ ఫోటోగ్రఫీతో వన్‌ప్లస్ నుంచి వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇది. 12 బిట్ రా ఫోటోగ్రాఫ్స్ ఫీచర్ వల్ల జేపీఈజీ, రా ఇమేజెస్‌ను ఒకేసారి క్యాప్చర్ చేసుకోవచ్చు. అలాగే ఎల్ఓజీ అనే ఫార్మాట్ ద్వారా కూడా బెస్ట్ ఫోటోలను తీసుకోవచ్చు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

