Xiaomi | జులై 5న షియామి 12 అల్ట్రా లాంఛ్
షియామి 12 అల్ట్రా లాంఛ్ వివరాలు ఆన్లైన్లో లీకయ్యాయి. తాజా రిపోర్ట్ ప్రకారం షియామి తన న్యూ ఫ్లాగ్షిప్ అండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను జులై తొలివారంలో లాంచ్ చేయనుంది.
న్యూఢిల్లీ : షియామి 12 అల్ట్రా లాంఛ్ వివరాలు ఆన్లైన్లో లీకయ్యాయి. తాజా రిపోర్ట్ ప్రకారం షియామి తన న్యూ ఫ్లాగ్షిప్ అండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను జులై తొలివారంలో లాంచ్ చేయనుంది. జూన్ 28 నుంచి లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన టీజర్లతో షియామి హోరెత్తిస్తుందని టెక్గోయింగ్ రిపోర్ట్ పేర్కొంది.
ఇక జులై 5న చైనాలో షియామి 12 అల్ట్రా లాంఛ్ ఈవెంట్ జరుగుతుందని తెలిపింది. న్యూ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్ఓసీ ప్రాసెసర్‌ను కలిగిఉంటుందని కంపెనీ నిర్ధారించింది. షియామి 12 అల్ట్రా షియామి నుంచి లీకా-ట్యూన్డ్ కెమెరాలతో వచ్చే తొలి స్మార్ట్‌ఫోన్ కావడం గమనార్హం. లేటెస్ట్ పోన్ వెనుకభాగంలో క్వాడ్ కెమెరా సెటప్‌తో రానుందని మరికొన్ని రిపోర్ట్స్ వెల్లడించాయి.
షియామి 12 అల్ట్రా 50ఎంపీ సోని ఐఎంఎక్స్989 మెయిన్ కెమెరా, 48ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, రెండు పెరిస్కోప్ కెమెరా సెన్సర్లు కస్టమర్లను ఆకట్టుకోనున్నాయి. లేటెస్ట్ స్మార్ట్‌పోన్ 6.6 ఇంచ్ కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లేతో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో 120డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను కలిగిఉంది. ఇక భారత్‌లో షియామి 12 అల్ట్రా లాంఛ్ ఎప్పుడు ఉంటుందనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

