బెజోస్‌తో స్పేస్ ట్రిప్.. 206 కోట్లు కట్టి ఇప్పుడు రాలేనంటున్న పాసింజర్

వాషింగ్టన్: గుర్తు తెలియని పాసింజర్ ఒకరు అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్‌తో కలిసి స్పేస్‌లోకి వెళ్లాలని ఉబలాటపడ్డారు. దీనికోసం ఆ సీటు వేలం వేస్తే.. ఏకంగా 2.8 కోట్ల డాలర్లు (రూ.206 కోట్లు) పెట్టి కొనుగోలు చేశారు. తీరా స్పేస్ ట్రిప్ సమయం దగ్గరపడుతున్న వేళ నేను ఇప్పుడు బిజీ.. రాలేనంటున్నారు. బ్లూ ఆరిజిన్ చేసే భవిష్యత్తు ట్రిప్‌లలో ఎప్పుడైనా వస్తానని ఆ పాసింజర్ సమాచారం పంపించారు. తన సంస్థ బ్లూ ఆరిజిన్ ఈ నెల 20న పంపబోయే రాకెట్లో జెఫ్ బెజోస్ అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ఇప్పటికే వర్జిన్ గెలాక్టిక్ ఫౌండర్ రిచర్డ్ బ్రాన్సన్ స్పేస్‌లోకి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే.
ఒకరు యంగ్.. మరొకరు ఓల్డ్
స్పేస్‌లోకి వెళ్లే అవకాశం వస్తే ఎవరు మాత్రం కాదనుకుంటారు. అందులోనూ వేలంలో కోట్లు పోసి కొన్న టికెట్. కానీ ఆ పాసింజర్ మాత్రం ఆ సమయంలో తాను బిజీ అని చెప్పడంతో బ్లూ ఆరిజిన్ మరో వ్యక్తిని ఎంపిక చేసింది. ఆ వ్యక్తి పేరు ఒలివర్ డేమెన్. వయసు కేవలం 18 ఏళ్లు మాత్రమే. దీంతో అతను స్పేస్‌లోకి వెళ్లనున్న అత్యంత పిన్న వయసు వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నాడు.
అంతేకాదు బెజోస్‌తో మరో వ్యక్తి 82 ఏళ్ల వాలీ ఫంక్ కూడా ఈ స్పేస్ ట్రిప్‌లో అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. దీంతో స్పేస్‌లోకి వెళ్తున్న అత్యంత పెద్ద వయసు వ్యక్తిగా ఈయన రికార్డు సృష్టించనున్నారు. వీళ్లిద్దరే కాకుండా ఈ ట్రిప్‌లో బెజోస్ సోదరుడు మార్క్ కూడా ఉండనున్నారు. న్యూ షెపర్డ్ తొలి హ్యూమన్ స్పేస్‌ఫ్లైట్.. భారత కాలమానం ప్రకారం ఈ నెల 20న ఉదయం 5 గంటలకు నింగిలోకి ఎగరనుంది. ఈ లాంచ్‌ను BlueOrigin.com వెబ్సైట్లో లైవ్ బ్రాడ్కాస్ట్ చేయనున్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

