బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన వ్యక్తికి ఉన్నచోటే రోబోటిక్ చికిత్స.. అమెరికా పరిశోధకుల సరికొత్త ఆవిష్కరణ
బ్రెయిన్ స్ట్రోక్ అనేది అత్యంత ప్రమాదకరమైనది. స్ట్రోక్‌కు గురైన వ్యక్తికి వెంటనే చికిత్స చేయాలి. చికిత్స ఆలస్యమైతే ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారు నగరానికి వచ్చేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇలాంటివారికోసమే అమెరికాలోని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకులు సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చారు. స్ట్రోక్ చికిత్స కోసం టెలిరోబోటిక్ సిస్టంను ఆవిష్కరించారు.
బ్రెయిన్ స్ట్రోక్ అనేది అత్యంత ప్రమాదకరమైనది. స్ట్రోక్‌కు గురైన వ్యక్తికి వెంటనే చికిత్స చేయాలి. చికిత్స ఆలస్యమైతే ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారు నగరానికి వచ్చేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇలాంటివారికోసమే అమెరికాలోని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకులు సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చారు. స్ట్రోక్ చికిత్స కోసం టెలిరోబోటిక్ సిస్టంను ఆవిష్కరించారు. ఇది స్ట్రోక్ రోగుల్లో టెలిఆపరేటెడ్ ఎండోవాస్కులర్ చికిత్సను సులభతరం చేస్తుంది. ఇందుకోసం పరిశోధకులు రిమోట్‌తో నిర్వహించగల రొబోటిక్ చేయిని రూపొందిస్తున్నారు.
‘స్ట్రోక్‌కు గురైన వ్యక్తిని మారుమూల ప్రాంతం నుంచి పెద్ద నగరానికి తరలించే బదులు స్థానికంగా ఈ రొబోటిక్ ఆర్మ్‌ను ఉపయోగించవచ్చు. స్థానిక దవాఖానల్లో నర్సులు వీటిని ఆపరేట్ చేసేందుకు వీలుంటుంది. ప్రధాన దవాఖాన నుంచి ప్రముఖ వైద్యులు రోగి పరిస్థితిని లైవ్‌లో చూడొచ్చు. రోబో సాయంతో తక్షణమే చికిత్స అందించవచ్చు’ అని ఎంఐటీ పరిశోధకుడు ప్రొఫెసర్ జువాన్హే జావో తెలిపారు. స్ట్రోక్‌కు గురైన రోగికి గోల్టెన్ అవర్‌లో చికిత్స అందించడమే తమ భవిష్యత్ కల అని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ అధ్యయనం “టెలిరోబోటిక్ న్యూరోవాస్కులర్ ఇంటర్వెన్షన్స్ విత్ మాగ్నెటిక్ మానిప్యులేషన్” పేరుతో సైన్స్ రోబోట్స్ జర్నల్‌లో ప్రచురితమైంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

