జియో మరో ముందడుగు.. త్వరలో భారత్‌కు 6జీ సేవలు.. ఫిన్లాండ్ యూనివర్సిటీతో ఒప్పందం
ప్రస్తుతం మనం 5జీ టెక్నాలజీలో ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా 5జీ టెక్నాలజీ పూర్తిస్థాయిలో రాకున్నా.. దానికంటే ముందే 6జీ టెక్నాలజీపై రిలయెన్స్ జియో కసరత్తు చేస్తోంది. ఇప్పుడిప్పుడే 5జీ అన్ని దేశాల్లో విస్తరిస్తుండగా.. 5జీ కంటే ముందే 6జీ టెక్నాలజీని భారత్‌లో తీసుకొచ్చేందుకు జియో కృషి చేస్తోంది. దానిలో భాగంగానే యూరప్‌లోని ఫిన్లాండ్లో ఉన్న ఓలు యూనివర్సిటీతో జియో ఒప్పందం చేసుకుంది. జియోకు యూరప్‌లోని ఎస్టోనియా అనే దేశంలో రీసెర్చ్ యూనిట్ ఉంది. ఆ రీసెర్చ్ యూనిట్.. ఓలు యూనివర్సిటీతో కలిసి 6జీ టెక్నాలజీ డెవలప్మెంట్లో భాగం కానుంది.

ఈ ఒప్పందంలో భాగంగా 5జీ టెక్నాలజీ సేవలను విస్తరించడంతో పాటు 6జీ టెక్నాలజీపై రీసెర్చ్ చేయనున్నారు. ఇప్పటికే ఓలూ యూనివర్సిటీ 6జీ టెక్నాలజీపై వర్క్ చేస్తోంది. ప్రపంచంలోనే 6జీ రీసెర్చ్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్న తొలి యూనివర్సిటీ అది. అందుకే.. జియో ఆ యూనివర్సిటీతో టైఅప్ అయింది.
ఇయో ఎస్టోనియా, రిలయెన్స్ గ్రూప్‌తో కలిసి పనిచేసేందుకు మేము చాలా ఆసక్తిగా ఉన్నాం. 6జీ టెక్నాలజీపై రీసెర్చ్ కోసం జియో ఎస్టోనియా రీసెర్చ్ విభాగం మాకు చాలా ఉపయోగపడుతుంది. దాని వల్ల.. భవిష్యత్తులో యూజర్ల అవసరాలను అనుగుణంగా వైర్లెస్ టెక్నాలజీ ద్వారా పరిష్కారం చూపడం కోసం జియోతో కలిసి పనిచేస్తాం.. అని ఓలు యూనివర్సిటీకి చెందిన 6జీ టెక్నాలజీ మీద పనిచేసే ప్రొఫెసర్ మాటీ లాట్వీ ఆహా వెల్లడించారు.
5జీ టెక్నాలజీని బేస్ చేసుకొని 6జీ టెక్నాలజీని అభివృద్ధి చేస్తామని.. దానిలో భాగంగా డిజిటలైజేషన్‌ను విస్తరిస్తామని.. 5జీతో పాటు 6జీ సేవలు కూడా కొనసాగుతాయని దాని వల్ల ఎక్కువ మంది యూజర్లకు ఈ సేవలు అందుతాయని యూనివర్సిటీ స్పష్టం చేసింది.
6జీ టెక్నాలజీ వల్ల స్పేస్, ఏరియల్ కమ్యూనికేషన్, హోలోగ్రాఫిక్ బీమ్ఫామింగ్, సైబర్ సెక్యూరిటీలో 3డీ కనెక్టెడ్ ఇంటెలిజెన్స్, మైక్రో ఎలక్ట్రానిక్స్, ఫోటానిక్స్ లాంటి సేవలు మెరుగ్గా పనిచేయడంతో పాటు వాటి పరిధిని విస్తరించుకోనున్నాయి.
భారత్‌లో ఉన్న 400 మిలియన్(40 కోట్లు) సబ్స్క్రైబర్లకు పెద్ద మొత్తంలో డేటాను ట్రాన్స్మిట్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. దానికోసమే.. 6జీ టెక్నాలజీ డెవలప్మెంట్పై దృష్టి పెడుతున్నాం. దాని వల్ల డేటాను ట్రాన్స్మిషన్ అనేది సులభం అవుతుంది, స్పీడ్ పెరుగుతుంది.. అని జియో ఎస్టోనియా సీఈవో టావీ కోట్కా వెల్లడించారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

