జపాన్‌కు చెందిన వీడియో గేమ్ పబ్లిషింగ్ కంపెనీ బండాయ్ నామ్కో మెటావర్స్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తోంది. దీని కోసం ఏకంగా వెయ్యి కోట్లను ఖర్చు పెడుతోంది. ఆ ప్రాజెక్ట్‌కు ఐపీ మెటావర్స్ అనే పేరు పెట్టింది. వచ్చే మూడేళ్లలో మెటావర్స్ ప్రాజెక్ట్ పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకుంది నామ్కో.
టోక్యోకు చెందిన ఈ కంపెనీ నుంచి విడుదలైన ఎన్నో వీడియో గేమ్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యాయి. అందులో పాక్‌మాన్, గుండం, డ్రాగన్ బాల్ జెడ్, సోల్ కాలిబర్ లాంటి వీడియో గేమ్స్‌ను పిల్లలు ఎంతో ఇష్టంగా ఆడుతారు. అయితే.. ఆ వీడియో గేమ్స్‌లో ఉండే ఫేమస్ క్యారెక్టర్స్ డార్క్ సోల్స్, డ్రాగన్ బాల్ జెడ్, ఎల్డెన్ రింగ్ మెటావర్స్‌లో ప్రత్యక్షం కాబోతున్నారు.
మెటావర్స్ అంటే ఏంటో తెలుసు కదా. అది ఒక వర్చువల్ ప్రపంచం. వీఆర్ హెడ్‌సెట్‌తో ఈ ప్రపంచాన్నే వర్ఛువల్‌గా ఇంట్లో కూర్చొని చుట్టేయొచ్చు. అందులోనే ఈ కంపెనీ వీడియో గేమ్స్‌లో ఉండే క్యారెక్టర్స్ ఉండబోతున్నాయన్నమాట. వాటి కోసమే వెయ్యి కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి మెటావర్స్ ప్రాజెక్ట్‌ను ఈ కంపెనీ చేపట్టింది.