ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ క్రియేట్ చేసేవాళ్లకు గుడ్‌న్యూస్. క్రియేటర్స్‌కి డబ్బులు సంపాదించి పెట్టే ఫీచర్‌ని టెస్ట్ చేస్తోంది మెటా. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే క్రియేటర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో నాన్ ఫంజిబుల్ టోకెన్స్‌ని అమ్మడం, కొనడం వంటివి చేయొచ్చు. నాన్‌ఫంజిబుల్ టోకెన్స్ అనేవి క్రిప్టో కరెన్సీలో భాగం. క్రిప్టో కరెన్సీ బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. అద్భుతమైన పెయింటింగ్స్, అరుదైన ఫొటోలు, చారిత్రక వస్తువులు వంటి వాటిని నాన్ ఫంజిబుల్ టోకెన్లుగా అమ్మకానికి పెట్టొచ్చు. అయితే, ఈ ఫీచర్ ముందుగా అమెరికాలోని క్రియేటర్స్‌కి మాత్రమే అందుబాటులోకి వస్తుందని చెప్పింది మెటా. ఈ కొత్త ఫీచర్ దాదాపు టిక్‌టాక్‌లోని కాయిన్స్, గిప్ట్స్ మానిటైజేషన్ స్కీమ్ లాంటిదని అంటున్నారు టెక్నాలజీ ఎక్స్పర్ట్స్.
వర్చువల్ గిఫ్ట్స్ పంపేలా
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ని క్రియేట్ చేసేవాళ్లకు ఉపయోగపడే ఫీచర్‌ని కూడా టెస్ట్ చేస్తోంది మెటా. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే…. యూజర్లు తమ ఫేవరెట్ కంటెంట్ క్రియేటర్స్‌కి వర్చువల్‌గా గిఫ్ట్‌లు పంపడం సాధ్యమవుతుంది.