Instagram : ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో స్పెషల్ ఫీచర్.. దీని గురించి తెలిస్తే ఎగిరి గంతేస్తారు
ఇన్స్టాగ్రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియా నెట్‌వర్క్‌గా మాంచి ఫామ్‌లో ఫేస్బుక్ ఉన్నప్పుడే లైమ్‌లైట్‌లోకి వచ్చింది ఇన్స్టాగ్రామ్. కేవలం ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకునే నెట్‌వర్క్‌గా బాగా ఫేమస్ అయింది ఇన్‌స్టా. ఎక్కువగా సెలబ్రిటీలు ఇన్స్టాకే మొగ్గు చూపడంతో ఇన్‌స్టా ఫేమస్ అయిపోయింది.

అయితే.. ఫేస్‌బుక్‌లా కాకుండా.. ఇన్‌స్టాలో ఏదైనా పోస్ట్ పెడితే.. దానికి కేవలం ఒక లవ్ సింబల్(లైక్ బటన్), కామెంట్, షేర్.. అనే మూడు ఆప్షన్లను మాత్రమే ఇచ్చారు. ఇక.. ఇన్‌స్టా స్టోరీస్‌లో మాత్రం కొన్ని రకాల ఎమోజీలను పంపే అవకాశం ఉంటుంది. లేదంటే జీఐఎఫ్ ఇమేజ్‌లను పంపించవచ్చు. కానీ.. పలానా స్టోరీ నచ్చితే.. దానికి లైక్ చేసే ఆప్షన్ లేదు. ఎమోజీని పంపించినా.. ఆ రియాక్షన్ డైరెక్ట్ మెసేజ్‌లోనే కనిపిస్తుంది.

అయితే.. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్.. స్టోరీస్‌కు లైక్ ఆప్షన్‌ను యాడ్ చేసేందుకు వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది. లైక్ బటన్‌ను మెయిన్ స్టోరీస్ పేజ్‌లో యాడ్ చేయనుందట. స్టోరీని యాడ్ చేసిన యూజర్.. తన స్టోరీకి ఎన్ని లైక్స్ వచ్చాయో తెలుసుకోవచ్చు. అలాగే.. ఒక్క యూజర్.. మల్టిపుల్ లైక్స్‌ను ఇవ్వొచ్చు. తనకు నచ్చితే ఎన్ని లైక్స్ అయినా ఆ స్టోరీకి ఇవ్వొచ్చు. దాని కోసం.. లైక్ బటన్ మీద క్లిక్ చేస్తూనే ఉండాలి. క్లిక్ చేస్తున్న కొద్దీ.. లైక్ కౌంట్ పెరుగుతుంది. అయితే.. స్టోరీస్‌లో కూడా లైక్ బటన్‌ను లవ్ సింబల్లోనే ఏర్పాటు చేయాలని ఇన్స్టాగ్రామ్ భావిస్తోందట. అయితే.. ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో మాత్రం తెలియనప్పటికీ.. లైక్ బటన్ ఫీచర్‌ను మాత్రం ఇన్‌స్టా డెవలప్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ లైక్ బటనే వస్తే.. ఇక.. ఇన్‌స్టా స్టోరీలు పెట్టే యూజర్లు పెరుగుతారు. తమ స్టోరీని ఎంతమంది లైక్ చేశారో తెలుసుకొని.. దాన్ని బట్టి.. తమ స్టోరీ వాళ్లకు నచ్చిందో లేదో తెలుసుకునే అవకాశం ఉంటుంది.
Actually you can put a like multiple times 👇🏻 pic.twitter.com/uPEa2gmgnm
— Alessandro Paluzzi (@alex193a) August 23, 2021
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

