Infinix GT 10 Pro | క్రేజీ ఫీచర్లతో ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రొ ఎంట్రీ : 7000ఎంఏహెచ్ బ్యాటరీ, 260డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్
ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రొ (Infinix GT 10 Pro) త్వరలో దేశీ మార్కెట్‌తో పాటు గ్లోబల్ మార్కెట్లలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. లాంఛ్‌కు ముందు ఈ హాట్ డివైజ్ డిజైన్, ఫీచర్లు ఆన్లైన్లో లీకయ్యాయి.
న్యూఢిల్లీ : ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రొ (Infinix GT 10 Pro) త్వరలో దేశీ మార్కెట్‌తో పాటు గ్లోబల్ మార్కెట్లలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. లాంఛ్‌కు ముందు ఈ హాట్ డివైజ్ డిజైన్, ఫీచర్లు ఆన్లైన్లో లీకయ్యాయి. ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రొ ఏకంగా 7000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో 256జీబీ స్టోరేజ్ ఇతర ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకోనుంది. టెక్ నిపుణులు పరాస్ గుగ్లానీ అందించిన వివరాల ప్రకారం న్యూ ఇన్ఫినిక్స్ ఫోన్ 256జీబీ స్టోరేజ్‌తో మెరుగైన పెర్ఫామెన్స్ కోసం 24జీబీ ర్యాంతో ఆకట్టుకోనున్నట్టు చెబుతున్నారు.
మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్తో రానుంది. 260డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 7000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో లేటెస్ట్ ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రానుంది. భారీ బ్యాటరీ సామర్ధ్యం, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌లో ఇన్పినిక్స్ అరుదైన డివైజ్‌గా ఆకట్టుకోనుందని సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్ 120హెచ్జడ్ అమోల్డ్ డిస్ప్లేతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో 100ఎంపీ ప్రైమరీ సెన్సర్ ప్రధాన ఆకర్షణగా మార్కెట్లోకి రానుంది.
ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రొ టీజర్‌ను గమనిస్తే ఈ స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ 2ను పోలి ఉంటుందని తెలుస్తోంది. ఇన్ఫినిక్స్ న్యూ డివైజ్ బ్లాక్, ఆరెంజ్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఆగస్ట్‌లో గ్లోబల్ మార్కెట్లోకి రానున్న ఇన్పినిక్స్ జీటీ 10 ప్రొ కోసం భారత కస్టమర్లు మరికొంత సమయం వేచిచూడాల్సి ఉంది. ఇక ఇన్పినిక్స్ జీటీ 10 ప్రొ+ భారత్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వదని చెబుతున్నారు.
Read More :
Cyber Fraud | ఫేక్ ఈ-మెయిల్‌తో పుణే కంపెనీకి రూ. 22 లక్షలు కుచ్చుటోపీ
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
Mouni Roy | గ్లామర్ డోస్ పెంచిన మౌనీ రాయ్.. రెడ్ డ్రెస్‌లో అందాల విందు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

