న్యూఢిల్లీ : పోకో ఎఫ్4 5జీ జూన్ 23న ఆన్లైన్ లాంఛ్ ఈవెంట్ ద్వారా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. పోకో ఎఫ్4 5జీ రూ 30,000 లోపు అందుబాటులో ఉంటుంది. గత ఏడాది లాంఛ్ అయిన పోకో ఎఫ్3 జీటీకి కొనసాగింపుగా పోకో ఎఫ్4 5జీ కస్టమర్ల ముందుకు రానుంది.
ఇక భారత్‌లో పోకో ఎఫ్4 5జీ ప్రారంభ ధర రూ 28,999గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక లాంఛ్‌కు ముందు పోకో ఎఫ్4 5జీ ఫీచర్లు, డిజైన్ సహా పలు వివరాలను కంపెనీ వెల్లడించింది. లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో పాటు డోల్బీ అట్మాస్‌ను సపోర్ట్ చేసే స్టీరియో స్పీకర్లతో పాటు పలు హాట్ ఫీచర్లతో కస్టమర్ల ముందుకు రానుంది.
పోకో ఎఫ్4 5జీ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 5జీ ప్రాసెసర్‌తో 67డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్‌తో 4500ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యాన్ని కలిగిఉంటుంది. 11 నిమిషాల్లోనే స్మార్ట్‌ఫోన్ సగం చార్జింగ్ అవుతుంది. పోకో ఎఫ్4 5జీ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ ఓఐఎస్ కెమెరాతో పాటు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో కస్టమర్లను ఆకట్టుకోనుంది.