WhatsApp Tricks : ఇక నుంచి వాట్సప్‌లో మెసేజ్ టైప్ చేయాల్సిన అవసరం లేదు.. ఇలా చేస్తే చాలు.. మెసేజ్ వెళ్లిపోతుంది
ఇక నుంచి వాట్సప్‌లో మెసేజ్ టైప్ చేయాల్సిన అవసరం లేదు | వాట్సప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాట్సప్ ద్వారా చాటింగ్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు.
వాట్సప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాట్సప్ ద్వారా చాటింగ్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. చాలామంది దీన్ని మెసేజ్‌లు పంపించుకోవడానికే ఉపయోగిస్తారు. అయితే.. ఎవరికైనా వాట్సప్ ద్వారా మెసేజ్ పంపించాలంటే.. కీప్యాడ్ ద్వారా టైప్ చేసి పంపించాల్సి ఉంటుంది. ప్రతి సారి.. టైప్ చేసి పంపించడం కుదరదు కదా. ఒక్కోసారి బయట ఉన్నప్పుడు.. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉన్నప్పుడు టైప్ చేయకుండా.. వేరే వాళ్లకు మెసేజ్ చేయలేమా? దానికి పరిష్కారమే.. వాయిస్ రికగ్నిషన్.

అవును.. కీప్యాడ్ ద్వారా టైప్ చేయకుండా మెసేజ్‌ను పంపించే ఫీచర్.. వాట్సప్‌లో ఉంది. కానీ.. ఇది చాలామందికి తెలియదు. సాధారణంగా వాట్సప్ చాట్ బాక్స్‌లో వాయిస్ పంపించే ఆప్షన్ ఉంది కానీ.. అది కేవలం వాయిస్‌ను ఒక ఆడియో ఫైల్లా పంపిస్తుంది కానీ.. మెసేజ్‌లా పంపించదు.
మెసేజ్‌లా అవతలి వ్యక్తికి వెళ్లాలంటే.. దాని కోసం ఫోన్లో కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాలి. గూగుల్ అసిస్టెంట్ సాయం తీసుకోవాలి. అయితే.. ఈ ట్రిక్ ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే వర్క్ అవుతుంది.
మీకో విషయం తెలుసా? 2015లోనే వాట్సప్ మెసేజ్‌లను వాయిస్ రూపంలో పంపించేందుకు గూగుల్ అసిస్టెంట్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇదే ఫీచర్‌ను ఐఫోన్లలోనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. యాపిల్ సిరిని ఉపయోగించి.. వాయిస్ మెసేజ్‌లను పంపించుకోవచ్చు.
గూగుల్ అసిస్టెంట్‌ను ఉపయోగించి టైప్ చేయకుండానే మెసేజ్‌లను పంపించేందుకు.. గూగుల్ అసిస్టెంట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. ప్రొఫైల్ ఫోటో రైట్ కార్నర్ మీద క్లిక్ చేయాలి. కిందికి స్క్రోల్ చేసి.. గూగుల్ అసిస్టెంట్ ఫంక్షన్‌ను ఆన్ చేయాలి.
గూగుల్ అసిస్టెంట్ ఆన్ అయ్యాక.. హేయ్ గూగుల్ లేదా ఓకే గూగుల్ అని పిలిస్తే.. అప్పుడు వాయిస్ అసిస్టెంట్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు.. ఫలానా వ్యక్తికి వాట్సప్ మెసేజ్ పంపించు అని చెప్పాలి. ఆ వ్యక్తి వాట్సప్ చాట్‌ను గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ చేస్తుంది. ఆ తర్వాత.. ఆ వ్యక్తికి ఏం మెసేజ్ పంపించాలో.. వాయిస్ అసిస్టెంట్‌కు చెప్పాల్సి ఉంటుంది. ఆ మెసేజ్‌ను ఆ వ్యక్తిని టెక్స్ట్ రూపంలో పంపిస్తుంది గూగుల్ అసిస్టెంట్. అలా.. టైప్ చేయకుండానే గూగుల్ అసిస్టెంట్ సాయంతో వాట్సప్ మెసేజ్‌ను పంపించుకోవచ్చన్నమాట.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఐఫోన్ యూజర్లూ.. బైక్‌పై వెళ్తున్నారా? మీ కెమెరా పాడవ్వచ్చు జాగ్రత్త!
WhatsApp : వాట్సప్ చాట్ బ్యాకప్స్ ఇక సురక్షితం.. సరికొత్త టెక్నాలజీతో ఈ2ఈ ఎన్క్రిప్షన్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

