COVID 19 Vaccine Certificate : వ్యాక్సిన్ వేసుకున్నారా? వాట్సప్‌లో వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
ప్రస్తుతం కరోనా మహమ్మారి మన దేశాన్ని పట్టి పీడిస్తోంది. దాని పీడ విరగడ చేయడం కోసం.. దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా నడుస్తోంది. ఇప్పటికే కొన్ని కోట్ల మంది వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నారు. వ్యాక్సిన్ వేసుకోవడం మాత్రమే కాదు.. వ్యాక్సిన్‌కు సంబంధించిన సర్టిఫికెట్ కూడా చాలా అవసరం. వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉన్నవాళ్లకే కొన్ని రకాల ప్రయోజనాలు అందుతున్నాయి. విదేశాలకు వెళ్లాలన్నా.. ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా.. వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను అడుగుతున్నారు. అందుకే.. వ్యాక్సిన్ వేసుకున్నాక సర్టిఫికెట్ తీసుకోవడం చాలా ముఖ్యం.

చాలామందికి వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఎక్కడ తీసుకోవాలో.. ఎలా తీసుకోవాలో తెలియదు. అటువంటి వాళ్ల కోసమే కేంద్ర ప్రభుత్వం MyGov Corona Helpdesk పేరుతో వాట్సప్‌లో అందుబాటులోకి వచ్చింది. కోవిడ్ 19 వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను ప్రజలకు డైరెక్ట్‌గా వాట్సప్ ద్వారా అందించేందుకు తీసుకొచ్చిన వెసులుబాటు ఇది.
గత మే నెలలోనే కేంద్ర ప్రభుత్వం.. మైగవ్ కరోనా హెల్ప్‌డెస్క్ వాట్సప్ చాట్‌బాక్స్‌ను తీసుకొచ్చింది. దాని ద్వారా.. దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ సెంటర్, కరోనా టెస్టింగ్ సెంటర్ల గురించి తెలుసుకునే అవకాశం ఉండేది.
తాజాగా.. వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను కూడా వాట్సప్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దానికోసం.. 9013151515 అనే నెంబర్‌కు డౌన్లోడ్ సర్టిఫికెట్ అనే పంపించాలి. ముందు ఆనెంబర్ ను మీ ఫోన్లో సేవ్ చేసుకొని.. ఆ తర్వాత వాట్సప్ ఓపెన్ చేసి.. ఆ నెంబర్ వాట్సప్ చాట్ బాక్స్ లో డౌన్ లోడ్ సర్టిఫికెట్ అని పంపించాల్సి ఉంటుంది. వెంటనే.. చాట్ బాక్స్ నుంచి 6 డిజిట్ ఓటీపీ కోడ్ పంపించాలంటూ మెసేజ్ వస్తుంది. మొబైల్ నెంబర్‌కు ఓటీపీ రాగానే.. ఆ ఓటీపీని వాట్సప్‌లో అదే నెంబర్‌కు పంపించాలి. ఆ తర్వాత.. వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను డైరెక్ట్‌గా వాట్సప్‌కే పంపిస్తారు. దీని కోసం ఖచ్చితంగా కోవిడ్ వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ ఉండాలి. ఆ నెంబర్‌కే ఓటీపీ వస్తుంది. ఆనెంబర్తోనే వాట్సప్ కూడా రిజిస్టర్ చేసుకొని ఉండాలి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతు మహాసభలను జయప్రదం చేయాలి’
BRS | బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ యువకులు
నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

