Wipro to Check Atttition | ఐటీలో వలసల జోరు.. అడ్డుకట్ట వేసేందుకు విప్రో వ్యూహం ఇలా!
Wipro to Check Atttition | ఐటీ నిపుణుల వలసలకు చెక్ పెట్టేందుకు మూడునెలలకోసారి ప్రమోషన్ పాలసీ అమలు చేయనుంది విప్రో.
Wipro to Check Atttition | కరోనా మహమ్మారితో ఐటీ సంస్థల్లో ప్రతిభావంతుల కోసం పోటీ పెరిగింది. వర్క్ ఫ్రం హోం విధానం అమలులో ఉండటంతో పనితీరును బట్టి నిపుణులకు గిరాకీ ఎక్కువైంది. దేశంలోని ప్రధాన ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, క్యాప్‌జెమినీ తదితర సంస్థల్లో నిపుణుల వలస (అట్రిక్షన్ Attrition ) పెరిగింది. ఇన్ఫోసిస్ అట్రిక్షన్లకు అడ్డుకట్ట వేసేందుకు ఆ సంస్థ నుంచి వెళ్లిపోయిన తర్వాత నిర్దిష్ట కాలంపాటు ఏ సంస్థలో చేరొద్దని ఆంక్షలు విధించింది. కానీ మరో ఐటీ దిగ్గజం విప్రో అందుకు భిన్నమైన వ్యూహాన్ని అమలు చేయబోతున్నది. 2.43 లక్షల మందికి పైగా సేవలందిస్తున్న విప్రోలో గత ఆర్థిక సంవత్సరం వలసలు (అట్రిక్షన్ – Attrition ) 23.8 శాతం నమోదైంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు నూతన ప్రమోషన్ వ్యూహాన్ని అమలులోకి తేవాలని విప్రో నిర్ణయించింది. ప్రతి మూడు నెలలకోసారి ఫ్రెషర్స్‌తోపాటు ప్రతి ఉద్యోగి పనితీరుపై సమీక్ష తర్వాత వారి ప్రతిభను బట్టి ప్రమోషన్ కల్పించనున్నది.
మూడు నెలలకోసారి ప్రమోషన్లు
సంస్థలోని 70 శాతం జూనియర్ ఉద్యోగులకు త్రైమాసికం వారిగా ప్రమోషన్లు పెంచాలని నిర్ణయించామని విప్రో సీఈవో కం మేనేజింగ్ డైరెక్టర్ థెర్రీ డెలాపోర్టే తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 38 వేల మంది ఫ్రెషర్స్‌ను నియమించుకోనున్నది. గతేడాది 19 వేల మందితో పోలిస్తే ఇది రెట్టింపు. వివిధ రూపాల్లో గతేడాది 45,416 మంది ఉద్యోగులు జత కలిశారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 15 వేల మంది నియామకంతో పోలిస్తే పలు రెట్లు ఎక్కువ ఇది.
విప్రోలో అట్రిక్షన్స్ ఇలా
విప్రోలో గత 12 నెలల్లో అట్రిక్షన్లు 23.8 శాతం కాగా, గతేడాది డిసెంబర్ నాటికి 22.7 శాతం. ఐటీ పరిశ్రమ అంతటా పెరుగుతున్న అట్రిక్షన్ల ట్రెండ్‌కు విప్రో కూడా నిలువుటద్ధంగా కనిపిస్తున్నది. వచ్చే ఐదేండ్లు కొత్త వారిని నియామకానికి ప్రణాళిక రూపొందించామని విప్రో హెచ్ఆర్ చీఫ్ ఆఫీసర్ సౌరబ్ గోవిల్ తెలిపారు. ఆదాయం పరంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో ప్రధాన ఐటీ సంస్థలు. ఈ నాలుగు సంస్థలు గత ఆర్థిక సంవత్సరంలో 2.20 లక్షల మంది ఫ్రెషర్లను నియమించుకున్నాయి.
ఇలా ఈ ఏడాది ఫ్రెషర్స్ నియామకం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ 40 వేలు, ఇన్ఫోసిస్ 50 వేలు, హెచ్‌సీఎల్ టెక్ 45 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నాయి. ఇన్ఫోసిస్‌లో గతేడాది చివరి త్రైమాసికం (2021-22)లో అత్యధికంగా 27.7 శాతం అట్రిక్షన్ నమోదైతే.. టీసీఎస్‌లో 17.4 శాతం ఉంది.
డిజిటేషన్తో ఐటీ నిపుణులకు ఫుల్ గిరాకీ
కరోనా మహమ్మారి వేళ శరవేగంగా డిజిటేషన్ పెరిగిపోవడంతో ఐటీ ప్రతిభావంతులకు డిమాండ్ ఎక్కువైంది. ఫ్రెష్ ఐటీ ప్రొఫెషనల్స్ నుంచి మిడ్, సీనియర్ లెవెల్ ఎగ్జిక్యూటివ్‌లకు ఫుల్ గిరాకీ ఏర్పడింది. అనూహ్యంగా పలువురు ప్రొఫెషనల్స్‌లో సంప్రదాయ ఐటీ కంపెనీల కంటే శరవేగంగా అభివృద్ధి కోసం స్టార్టప్‌ల వైపు మళ్లుతున్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

