PUBG : పబ్జీ ప్లేయర్లకు గుడ్‌న్యూస్.. కంప్యూటర్లో ఫ్రీగా వారంపాటు గేమ్ ఆడే చాన్స్
నిజానికి పబ్జీ గేమ్ ఇండియాలో బ్యాన్ అయింది కానీ.. అవే ఫీచర్లతో బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా అనే యాప్‌ను ఇటీవలే లాంచ్ చేశారు. అది కూడా పబ్జీ లాంటిదే.. అచ్చుగుద్దినట్టు ఉంటుంది. అవే టాస్క్‌లు.. అవే అడ్వాంటేజ్‌లు కానీ.. పేరు మారింది. త్వరలోనే ఈ యాప్ 5 కోట్ల మార్కును చేరుకోబోతోంది. ఇప్పటి వరకు ఈ యాప్‌ను 4.8 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. కొన్ని రోజుల్లో 5 కోట్ల డౌన్లోడ్స్ కానున్నాయి.

పబ్జీ కూడా పేరు మార్చుకొని పబ్జీ : బ్యాటిల్‌గ్రౌండ్స్ పేరుతో మళ్లీ మార్కెట్లోకి వచ్చేసింది. అంతే కాదు.. ఇప్పుడు మరో బంపర్ ఆఫర్‌తో వచ్చేసింది. ఆగస్టు 10 నుంచి అంటే మంగళవారం నుంచి ఆగస్టు 16 వరకు ఒక వారం పాటు ఉచితంగా పబ్జీ గేమ్‌ను కంప్యూటర్లలో ఆడుకోవచ్చు. అయితే.. ఈ వారం రోజుల వరకు ఫుల్ వర్షన్‌ను ఇవ్వరు. కేవలం స్టీమ్ వర్షన్‌ను మాత్రమే ఇస్తారు. ప్లే ఫర్ ఫ్రీ.. ఫ్రీ ప్లే వీక్ పేరుతో ఈ ఆఫర్‌ను పబ్జీ తీసుకొచ్చింది. స్టీమ్ వర్షన్‌ను ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని.. పీసీలలో ఆడుకోవచ్చు. వారం తర్వాత.. గేమ్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

కొత్త ప్లేయర్ల కోసం.. తమ యాప్ డౌన్లోడ్స్ పెంచుకోవడం కోసం పబ్జీ ఇలా ఫ్రీ ఆఫర్‌ను ప్రకటించింది. కొత్త ప్లేయర్లు జాయిన్ అయితే.. వాళ్లకు రివార్డ్స్‌ను ఇవ్వనుంది. 600 మీటర్ల దూరాన్ని పారాచుట్ ద్వారా పరిగెడితే స్లీవ్‌లెస్ చీతా టాప్ రివార్డును గెలుచుకోవచ్చు. అలాగే.. యుటిలిటీ బెల్ట్స్, వ్రాంగ్లర్ షర్ట్, వైడ్ రెడ్ పాంట్స్ లాంటి సరికొత్త రివార్డ్స్‌ను కొత్త ప్లేయర్ల కోసం సిద్ధం చేసింది పబ్జీ.
అయితే.. పీసీలో ఈగేమ్‌ను ఆడుతూ చాలామంది చీట్ చేస్తున్నారని.. చాలామంది ప్లేయర్ల నుంచి ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో.. ఫ్రీ వర్షన్‌తో అయినా కొత్త ప్లేయర్లు జాయిన్ అయి.. చీట్ చేయకుండా ఆడుతారో లేదో చూద్దాం మరి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

