ChatGPT | చాట్ జీపీటీ నుంచి కొత్త అప్డేట్.. టెక్ట్స్ నుంచి వీడియోల సృష్టి!
ChatGPT | చాట్‌జీపీటీలో సరికొత్త ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి రానున్నది. టెక్ట్స్‌ను వీడియోలు, ఇమేజ్‌లుగా మార్చే జీపీటీ-4 త్వరలోనే యూజర్ల దరిచేరనున్నదని మైక్రోసాఫ్ట్ జర్మనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అండ్రియాస్ బ్రౌన్ తెలిపారు.
ChatGPT |చాట్ జీపీటీలో యూజర్లకు కొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతున్నది. ఇప్పటికే చాట్‌జీపీటీ చాట్‌బోట్ ద్వారా డేటా తయారీ, చాటింగ్ వంటివి వచ్చాయి. తాజాగా టెక్ట్స్ నుంచి వీడియోలు, ఇమేజ్‌లను ఆవిష్కరించే ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానున్నది. ఈ సంగతి మైక్రోసాఫ్ట్ జర్మనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అండ్రియాస్ బ్రౌన్ తెలిపారు. కొత్తగా డెవలప్ చేసిన ఫీచర్‌కు జీపీటీ-4 అని పేరు పెట్టారు. ఈ నెల నాలుగో తేదీన జరిగిన `ఏఐ ఇన్ ఫోకస్-డిజిటల్ కిక్ అప్` అనే కార్యక్రమంలో ఈ అప్డేట్ను మైక్రోసాఫ్ట్ జర్మనీ చీఫ్‌టెక్నాలజీ ఆఫీసర్ అండ్రియాస్ బ్రౌన్ వెల్లడించారు.
ఇప్పటి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత రోబో లవ్ లెటర్లు రాయడం.. కవితలు రాయడం చేస్తున్నది. ఈ-మెయిల్స్ కూడా పంపుతున్నది. జోకులు కూడా పేలుస్తున్నది. ఇవి ఏఐ బేసిక్ శక్తి సామర్థ్యాలు.. కానీ చాట్ జీపీటీ చాట్‌బోట్ ఎంట్రీతో ఏఐ టూల్ శక్తి సామర్థ్యాలు మరింత పెరిగాయి. కొత్తగా టెక్ట్స్‌ను వీడియోగా మార్చేస్తుంది చాట్ జీపీటీ. `టెక్స్ట్ టు వీడియో`ఫీచర్ వచ్చేవారం ఆవిష్కరిస్తారు. జీపీటీ-3.5కి అప్డేటెడ్ వర్షన్ జీపీటీ-4 వర్షన్ మరింత శక్తిమంతం, బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలుస్తుందని టెక్ వెబ్సైట్ స్టఫ్ పేర్కొంది.
పాపులర్ చాట్‌జీపీటీ చాట్‌బోట్ సృష్టించిన స్టార్టప్ కంపెనీ ఓపెన్ఏఐలో అతిపెద్ద ఇన్వెస్టర్ మైక్రోసాఫ్ట్ అన్న సంగతి తెలిసిందే. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం అప్డేట్ జీపీటీ-4.. మల్టీ మోడల్‌గా ఉంటుందని భావిస్తున్నారు. జీపీటీ-4లో టెక్ట్స్‌తోపాటు ఇమేజ్‌లు, వీడియోల తయారీకి సంబంధించిన శక్తి సామర్థ్యాలను వెల్లడిస్తామని అండ్రియాస్ బ్రౌన్ తెలిపారు. మల్టీ మోడల్ శక్తి సామర్థ్యాల కింద చాట్ బేస్డ్ ఏఐ.. టెక్ట్స్‌ను ఇమేజ్‌లుగా, సౌండ్‌తో కూడిన వీడియోలుగా మార్చేస్తుంది.
ప్రస్తుత చాట్ జీపీటీ-3, జీపీటీ-3.5 వర్షన్లలో చాట్‌బోట్ నుంచి టెక్ట్స్ ఔట్పుట్ వస్తుంది. గూగుల్, మెటా వంటి టెక్ జెయింట్స్ ఇప్పటికే తమ యూజర్లకు సర్వీస్‌తో కూడిన ఆఫర్లు ప్రకటించాయి. ఫేస్బుక్ పేరెంట్ సంస్థ మెటా.. `మేక్-ఏ-వీడియో`, గూగుల్.. టెక్ట్స్ టు ఇమేజ్ జనరేటర్ `ఇమేజెన్ వీడియో`ను ఆవిష్కరించనున్నాయి. మెటా, గూగుల్ సర్వీసు ఇంకా పరిశోధన స్థాయిలోనే ఉంది. జనరేటివ్ ఏఐ స్పేస్‌లో ఇతర టెక్ జెయింట్స్ కంటే ఓపెన్ ఏఐ ఓ అడుగు ముందుకేస్తున్నది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

