Keeda Cola Review | ‘కీడాకోలా’ సినిమా రివ్యూ
Keeda Cola Movie Review | పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు తరచూ వస్తూనేవుంటాయి. కానీ విడుదలకు ముందే ఆసక్తిని రేకెత్తించే సినిమాలు మాత్రం అరుదుగా వస్తూవుంటాయి. అలాంటి సినిమానే ‘కీడాకోలా’. ఈ సినిమాపై అంచనాలు ఉండటానికి ఒకే ఒక కారణం దర్శకుడు తరుణ్‌భాస్కర్.
సినిమా : కీడా కోలా
తారాగణం: తరుణ్‌భాస్కర్, బ్రహ్మానందం, చైతన్యరావు, , రాగ్ మయూర్, జీవన్‌కుమార్, రఘురామ్, రవీంద్రవిజయ్..
దర్శకత్వం: తరుణ్‌భాస్కర్
నిర్మాతలు: కె.వివేక్ సుధాంశు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస కౌశిక్ నండూరి, శ్రీపాద నందిరాజ్, ఉపేంద్రవర్మ..
Keeda Cola Review | పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు తరచూ వస్తూనేవుంటాయి. కానీ విడుదలకు ముందే ఆసక్తిని రేకెత్తించే సినిమాలు మాత్రం అరుదుగా వస్తూవుంటాయి. అలాంటి సినిమానే ‘కీడాకోలా’. ఈ సినిమాపై అంచనాలు ఉండటానికి ఒకే ఒక కారణం దర్శకుడు తరుణ్‌భాస్కర్. ఆయన దర్శకత్వంలో గతంలో వచ్చిన పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలు విమర్శకుల ప్రశంసలందుకోవడమేకాక, వాణిజ్యపరంగా కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. ఆయన దర్శకత్వం వస్తున్న మూడో సినిమా అవ్వడంతో ‘కీడాకోలా’పై మామూలుగానే అంచనాలు మొదలయ్యాయి. మరి అందరి అంచనాలనూ ‘కీడాకోలా’ అందుకుందా? తరుణ్‌భాస్కర్ గత చిత్రాల స్థాయిలో ఈ సినిమాకూడా నిలిచిందా? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ముందు కథలోకెళ్లాలి..
కథ గురించి
వాస్తు(చైతన్యరావు) అనుకోకుండా చిక్కుల్లో పడతాడు. అందులోంచి బయటపడాలంటే డబ్బు అవసరం. జీవన్(జీవన్‌కుమార్).. అనుకోకుండా అవమానాలపాలవుతాడు. ప్రతీకారం తీరాలంటే అతను కార్పొరేటర్ కావాలి. దానికీ డబ్బే అవసరం. వాస్తు తన తాత వరదరాజులు(బ్రహ్మానందం)కోసం తెచ్చిన శీతలపానీయంలో బొద్దంక కనిపిస్తుంది. ఎలాగూ డబ్బు అవసరం కాబట్టి.. దీన్నే అదనుగా తీసుకొని, లీగల్‌గా ప్రొసీడవుతామని సదరు శీలత పానీయం కంపెనీవారిని బెదిరించి డబ్బుగుంజుదామని వాస్తు మిత్రుడు, న్యాయవాది అయిన కౌశిక్(రాగ్‌మయూర్) సలహా ఇవ్వడంతో అసలు కథ మొదలవుఉంది. ఇక జీవన్ విషయానికొస్తే.. తన అన్న నాయుడు(తరుణ్‌భాస్కర్) జైలునుండి విడుదలవ్వడంతో.. అన్న అండతో ఎలాగైనా కారొరేటర్ అవుదామని ఆశపడతాడు. కానీ దానికి కూడా డబ్బే అవసరం కావడంతో వాళ్లు ఓ పన్నాగం పన్నుతారు. ఇంతకీ జీవన్ అండ్ బ్యాచ్ పన్నిన పన్నాగం ఏంటి? శీతలపానీయం కంపెనీవాళ్లను బెదిరించి వాస్తు అండ్ బ్యాచ్ డబ్బులు కొట్టేయగలిగారా? వాస్తు, జీవన్‌లు డబ్బులు సంపాదించగలిగారా? అసలు ఆ ‘కీడాకోలా’ బొద్దంకి ఎలా వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలినకథ.
కథా విశ్లేషణ
లాజిక్కులతో నిమిత్తం లేకుండా నవ్వించడమే పరమావధిగా తీసుకొని చేసిన సినిమా ఇది. అనుకున్నట్టే తరుణ్‌భాస్కర్ బాగానే నవ్వించాడు. ఆయన గత చిత్రాల్లో వినోదంతోపాటు సందేశం కూడా ఉంటుంది. ఇందులో వినోదమే తప్ప సందేశం కనిపించదు. ప్రథమార్థం పాత్రల పరిచయాలతో సరిపోతుంది. కథంతా ద్వితీయార్థమే. ఈ సినిమాలో ప్రత్యేకతేంటంటే.. ప్రధానమైన స్త్రీ పాత్ర అంటూ ఒక్కటీ కనిపించదు. దాదాపు అన్నీ మగపురుగులే. ఓ విధంగా దీన్ని ప్రయోగమనే అనాలి. కథాపరంగా కూడా స్త్రీ పాత్రతో సంబంధంలేదు. అలా రాసుకున్నాడు తరుణ్‌భాస్కర్. తప్పు చేయకుండా లీగల్‌గా ఈజీ మనీ సంపాదించొచ్చనే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. సందేశం అనేది లేకపోయినా.. సమాచారం మాత్రం ఉందీ కథలో. అయితే.. అక్కడక్కడే లాజిక్కులు లేకుండా నడక సాగుతుంది. సినిమాలో పాత్రలన్నీ తేడాగానే కనిపిస్తాయి. తెరపై అందరూ మేధావుల్లా కనిపించే తెలివితక్కువ జనమే కనిపిస్తారు. వారి ప్రవర్తన, అసంబద్ధమైన కోరికలు, తెలీనితనం, వీటికి తోడు సీనియస్నెస్.. వీటన్నింటినుంచీ కామెడీ పుడుతూవుంది. కథలో, కథనంలో, పాత్రధారుల నటనలో అన్నింటిలో తరుణ్‌భాస్కర్ మార్క్ మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తూవుంది. తెరపై అందరూ సీరియస్‌గా కనిపిస్తారు. ఆ సీరియస్‌నెస్ నుంచే కామెడీ పుడుతూవుటుంది.
నటీనటుల నటన
తరుణ్‌భాస్కర్ మంచి దర్శకుడు మాత్రమే కాదు, మంచి నటుడు కూడా అని అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో నాయుడుగా కనిపించి బాగానే మెరిశారు మిగతావారినుంచి కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ని రాబట్టగలిగారు. ముఖ్యంగా చైతన్యరావ్ నత్తి పాత్రలో బాగా నటించాడు. అతన్ని దృష్టి పెట్టుకొని కూడా కథలు రాయొచ్చే అనే స్థాయిలో ఉంది అతని నటన. రాగ్‌మయూర్, జీవన్ అందరూ బాగా చేశారు. బ్రహ్మానందం పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీల్‌ఛైర్‌కే పరిమితమైన పాత్రను ఆయన చేసినా అవకాశం దొరికినప్పుడల్లా తనదైన శైలిలో కుర్రాళ్లకు పోటీగా నవ్వించారు. ఇందులో ఆయన నటించలేదు.. కేవలం బిహేవ్ చేశారు.
టెక్నికల్‌గా
దర్శకుడిగా తరుణ్‌భాస్కర్ మరోసారి మెరిశాడని చెప్పకతప్పదు. కానీ కథనం విషయంలో కాస్త జాగ్రత్త పాడితే బావుండేది. కథానుగుణంగా కథనం ఉండదు. తన సౌకర్యంమేర కథనం ఉంటుంది. దాంతో ఆడియన్స్‌లో రకరకాల ప్రశ్నలు పుట్టుకొస్తుంటాయి. అయితే.. అందర్నీ నవ్వించేసేసి, తప్పులన్నింటినీ కనపడకుండా చేసేశాడు తరుణ్‌భాస్కర్. ముఖ్యంగా వాస్తు అండ్ గ్యాంగ్, జీవన్ అండ్ గ్యాంగ్ ఎదురెదురు పడే సన్నివేశంలో అయితే పొట్టచెక్కలయ్యేలా నవ్వించాడు. నవ్వించటానికి సినిమా తీశాడు.. నవ్వించాడు. తన లక్ష్యాన్ని సాధించాడు. సాంకేతికంగా ఎక్కడ కూడా వంక పెట్టటానికి లేదు. అన్ని విధాలా సినిమా బావుంది. చివరిగా చెప్పొచ్చేదేంటంటే.. కాసేపు హాయిగా నవ్వుకోవాలనుకునేవాళ్లకు ‘కీడాకోలా’ బెస్ట్ ఛాయిస్..
ప్లస్ పాయింట్స్:
ద్వితీయార్థం, నటీనటుల నటన, కామెడీ..
మైనస్ పాయింట్స్
ప్రథమార్థం, నిజానికి దూరంవున్న కథనం
రేటింగ్ : 3.00/5
Read Today's Latest Reviews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

