గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య

మోమిన్‌పేట : వర్షాకాలం ప్రారంభం అయినందునా గ్రామంలో పారిశుధ్య సమస్యలతో పాటు తదితర సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య తెలిపారు. గురువారం మోమిన్‌పేట మండల పరిధిలోని దేవరంపల్లి గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ గ్రామంలో ఇండ్ల మధ్యన పెంటకుప్పలు, మురుగు నిలువకుండా ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు.
సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రకృతి వనంలో మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతలు తీసుకోవాలని వివరించారు. గ్రామంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని పేర్కొన్నారు. ఆయన వెంట సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీవో యాదగిరి, వెంకటేశం ఉన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

