Vikarabad : అసువులు బాసిన అమరవీరులకు వందనం
- జిల్లా పరేడ్ గ్రౌండ్లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం
- గౌరవ వందనం చేసిన కలెక్టర్ నిఖిల
- కార్యక్రమంలో పాల్గొన్న వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్

పరిగి : విధి నిర్వహణలో, సమాజ రక్షణలో అసువులు బాసిన పోలీసు అమరవీరులను స్మరణ చేసుకోవడానికి సంస్మరణ దినాన్ని నిర్వహిస్తున్నామని వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎం.నారాయణ తెలిపారు. గురువారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా వికారాబాద్‌లోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ నిఖిల, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరేడ్ కమాండర్‌తో జిల్లా కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించడంతోపాటు అమరవీరుల పేర్లు గల పుస్తకాన్ని విడుదల చేసి జిల్లా ఎస్పీకి అందజేశారు. పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.నారాయణ మాట్లాడుతూ.. 1959 అక్టోబర్ 21న హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో డీఎస్పీ కరమ్‌సింగ్ నేతృత్వంలోని 21 మంది బీఎస్ఎఫ్ బృందం కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎలాంటి హెచ్చరికలు లేకుండా చైనా సైనికులు కాల్పులు జరుపడంతో డీఎస్పీ కరమ్సింగ్తోపాటు 10 మంది దేశ రక్షణలో వీర మరణం పొందారని గుర్తు చేశారు.
యుద్ధ భూమిలో దేశం కోసం పోరాడి ప్రాణాలు వదలిన వారి కోసం ప్రతి యేటా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం నిర్వహిస్తున్నామని తెలిపారు. 2020 సెప్టెంబర్ 1 నుంచి 2021 ఆగస్టు 31 వరకు దేశ రక్షణలో 377 మంది పోలీసులు తమ ప్రాణాలు కోల్పోయారని ఎస్పీ పేర్కొన్నారు. ఎలాంటి సమయంలోనైనా ప్రజలకు రక్షణ కల్పిస్తూ తమ ప్రాణాలు సైతం తృణప్రాయంగా వదిలిపెట్టిన వీర సైనికులను ఒక్కసారి తలుచుకుందామని చెప్పారు. ఇటీవల ప్రపంచాన్ని భయపెట్టిన కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో సైతం పోలీసులు అందించిన సేవలు ఎంతో ప్రశంసనీయమని ఎస్పీ పేర్కొన్నారు. ఇటీవల వరదల్లో చిక్కుకున్న ప్రజలను పోలీసులు తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కాపాడారని తెలిపారు. వారి సేవలు వెల కట్టలేనివని ఎస్పీ అన్నారు.
జిల్లా పరిధిలో సైతం వరదలు వచ్చినపుడు తెగిపోయిన రోడ్లు, వంతెనలు, బాటలను మన పోలీసు అధికారులు ముందుగానే గుర్తించి ప్రజలను హెచ్చరించి చేసిన పనులు ఎంతో గొప్పవని ఎస్పీ అభినందించారు. పోలీసులు చక్కగా పనిచేయడం వల్లనే ఇతర శాఖలకు సంబంధించిన అనేక పనులు సైతం పోలీసులకు అప్పగిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం పోలీసు శాఖకు అధునాతన వాహనాలు అందజేసిందని తెలిపారు. ప్రతి పని మనది అని పనిచేయాలని పోలీసు సిబ్బందికి ఎస్పీ సూచించారు. గంజాయిని పూర్తిస్థాయిలో అరికట్టడంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని, ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎం.ఎ.రశీద్, వికారాబాద్, పరిగి, తాండూరు డీఎస్పీలు సత్యానారాయణ, శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

