మహిళ శిశు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
- షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
- మేకగూడలో అంగాన్వాడీ భవనం ప్రారంభం

నందిగామ : మహిళ, శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం నందిగామ మండలం మేకగూడ గ్రామంలో నాట్కో ట్రస్ట్ ఆర్థిక సహకారంతో రూ. 20లక్షల వ్యయంతో నిర్మించిన నూతన అంగాన్వాడీ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం సంఘీగూడ గ్రామంలో నాట్కో ట్రస్ట్ సహకారంతో నిర్మిస్తున్న అంగాన్వాడీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం 45రోజుల నుంచి 9నెలల వయస్సు ఉన్న చిన్న పిల్లలకు (పీసీసీ) నిమోనియా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్న వయస్సు నుంచే పిల్లలకు మంచి పోషనతో కూడిన ఆహారం అందించడం ద్వారా పిల్లలలో చిన్న వయస్సు నుంచే రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారన్నారు. అంగాన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారన్ని క్రమం తప్పకుండా పిల్లలకు అందించాలని సూచించారు. వ్యాధులు ప్రభలకుండా పిల్లలకు టీకాలు వేయించాలని సూచించారు. నాట్కో ట్రస్ట్ సహకారంతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం సంఘీగూడ గ్రామానికి చెందిన మరిపల్లి యాదయ్యకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అందజేశారు. కార్యక్రమంలో మేకగూడ సర్పంచ్ పాండురంగారెడ్డి, మేకగూడ పీఏసీఎస్ చైర్మన్ మంజులరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నోముల పద్మారెడ్డి, ఎంపీటీసీ రాజునాయక్, జిల్లా వెల్పేర్ అధికారి మోతి, సీడీపీవో నాగమణి, ఐసీడీఎస్ సూపర్వైజర్ జ్యోతి, నాట్కో ట్రస్ట్ మేనేజర్ రాంబాబు, సూర్యనారాయణ, నాయకులు నర్సింహులు, మేకం రాజు, శ్రీశైలం పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

