పందిరి విధానంలో కాకరపంట సాగు
కాకర అనగానే అందరికీ చేదు గుర్తుకొస్తుంది. కానీ పందిరి జాతి కూరగాయల్లో కాకరకు విశిష్ఠ స్థానం ఉన్నది. మార్కెట్‌కు అనుగుణంగా పంట ను సాగు చేస్తే అధిక లాభాలను ఆర్జించొచ్చని నిరూపించాడు మండలంలోని సంగాయిగుట్టతండాకు చెందిన రైతు రమావత్ పాండ్యానాయక్.
- ఏడాది పొడవునా నాణ్యమైన దిగుబడి.. స్థిరమైన ధర
- 65 రోజుల్లోనే పంట చేతికి..
- విత్తనాల ఎంపికే ప్రాధానం
- సంగాయిగుట్టతండాకు చెందిన రైతు రమావత్ పాండ్యానాయక్
యాలాల, డిసెంబర్ 16 : కాకర అనగానే అందరికీ చేదు గుర్తుకొస్తుంది. కానీ పందిరి జాతి కూరగాయల్లో కాకరకు విశిష్ఠ స్థానం ఉన్నది. మార్కెట్‌కు అనుగుణంగా పంట ను సాగు చేస్తే అధిక లాభాలను ఆర్జించొచ్చని నిరూపించాడు మండలంలోని సంగాయిగుట్టతండాకు చెందిన రైతు రమావత్ పాండ్యానాయక్. తనకున్న ఎకరం పొలంతోపాటు మరో అర ఎకరం పొలాన్ని కౌలు కు తీసుకుని నిలువు పందిరి విధానంలో రెండేండ్లుగా కాకరను సాగు చేస్తున్నాడు. ఏడాది పొడువునా.. నాణ్యమైన దిగుబడిని తీస్తూ నిరంతరంగా ఆదాయాన్ని పొందుతున్నాడు. అధిక దిగుబడినిచ్చే సంకరజాతి రకాలు, అందుబాటులో మార్కెట్ సౌకర్యం ఉండడంతో కాకరసాగు ఎంతో లాభదాయకంగా ఉన్నది.
రైతు రమావత్ పాండ్యానాయక్ పందిరి విధానంలో కాకుండా నిలువు పందిరి పద్ధతిలో కాకర పంటను సాగు చేస్తున్నాడు. ఈ విధానంలో మొదట కొంచెం ఖర్చు ఎక్కువైనప్పటికీ తర్వాత ఖర్చులు తగ్గుతాయని.. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను సాధించొచ్చని అతడు పేర్కొంటున్నాడు.
తీగజాతి కూరగాయలు తినడం వల్ల బరువు తగ్గడంతోపాటు క్యాన్సర్‌ను తగ్గిస్తుంది. దీంతో మార్కెట్లో వీటిని మంచి డిమాండ్ ఉంటుంది. యాజమా న్య పద్ధతులు, మెళకువలు పాటిస్తే తక్కువ పెట్టబడితో అధిక దిగుబడులు పొందొచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
జాగ్రత్తలతో లాభాలు..
తీగజాతి కూరగాయల సాగు చాలా తేలిక. ఖర్చు కూడా తక్కువే. ఇవి ఎగబాకేందుకు వెదురు కర్రలతో పందిళ్లు వేసి వాటిపైకి ఎక్కేందుకు తాళ్లను కట్టాలి. పందిరి వేస్తే కాచిన కాయలు కిందకు వేలాడుతాయి. ఇలా వేలాడిన వాటిని తెంపడం సులభం. ఇలా పండించిన కూరగాయలతో అధిక లాభాలను పొందొచ్చు. తీగజాతి కూరగాయల పంటలకు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలు సరైన సమయం. అందువల్ల రైతులు దృష్టి సారించాలి. సోరకాయ, దోసకాయ, కాకరకాయ విత్తనాలను జనవరి రెండోమాసం నుంచి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవాలి. బీర విత్తనాలను డిసెంబర్ రెండోవారం నుంచి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవచ్చు. దొండ జూన్, జూలై నెలల్లో విత్తుకోవాలి.
కాకరతో ఆరోగ్యం పదిలం

కాకరను పచ్చిగా తింటేనే ఎక్కువ లాభాలు. కాకర జ్యూస్ చేసుకొని తాగినా మంచి ఫలితాలు ఉంటాయి. రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. మెదడు మరింత చురుకుగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. మధుమేహం ఉన్న రోగులకు ఇది ఎంతో మేలు చేస్తుంది. మధుమేహం అధికం కాకుండా నిరోధిస్తుంది. బీపీని అదుపులో ఉంచడమే కాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కాకర జ్యూస్‌లోని పీచు పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ సమస్యలు రాకుండా సహాయపడుతుంది. బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. కాకర జ్యూస్‌లో తేనె, క్యారెట్, ఆపిల్ జ్యూస్ వంటి పదార్థాలు కలుపుకొని తాగవచ్చు.
డా.అనూష, యాలాల మండల వైద్యాధికారి
మార్కెట్లో కాకరకు మంచి డిమాండ్ ఉన్నది. ఏడాది పొడుగునా దీనికి స్థిరమైన ధర ఉంటుంది. 60 నుంచి 65 రోజుల్లో పంట చేతికి వస్తుంది. విత్తనాలను మన ప్రాంత వాతావరణానికి, నెలలకు అనువైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. కోయంబత్తూర్ లాంగ్, మహికో గ్రీన్లాండ్, గ్రీన్, ఆర్మ హరితలతో అధిక లాభాలను పొందొచ్చు. విత్తనశుద్ధితో వేరుకుళ్లు సమస్యలు రావు. ఎకరంన్నర సాగు చేయగా రూ.68 వేలు వచ్చాయి.
– రమావత్ పాండ్యానాయక్, రైతు, సంగాయిగుట్టతండా, యాలాల
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

