కులకచర్ల : కులకచర్ల మండల పరిధిలోని పటెల్చెరువుతండాలో ఉన్న బృహత్ పల్లె ప్రకృతివనాన్ని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య పరిశీలించారు. బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని గ్రామ పంచాయతీ సిబ్బందికి సూచించారు. పల్లె ప్రగతి పనులు పూర్తి స్థాయిలో నిర్వహించాలన్నారు. పెండింగ్లో ఉన్న అన్ని పనులు పూర్తి చేసే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శాంతితులసీరాం, ఈవోఆర్డీ సుందర్, ఏపీవో వెంకటేశ్ పాల్గొన్నారు.