Moinabad : కేజీరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా

మొయినాబాద్ : విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విద్యార్థులకు ఉపాధి కల్పనలో విశేష కృషి చేయడం వలనే కేజీరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా లభించిందని కళాశాల చైర్మన్ కే. కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా వచ్చిందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయని పేర్కొన్నారు. ప్రస్తుత ఏడాది నుంచి 10 ఏండ్ల పాటు స్వయం ప్రతిపత్తి హోదా ఉంటుందని తెలిపారు. స్వయం ప్రతిపత్తి హోదా రావడం వలన విద్యార్థులకు చాలా ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు.
స్వయం ప్రతిపత్తితో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి ప్రత్యేక నిధులు మంజూరు అవుతాయన్నారు. విద్యా సంబంధితమైన సిలబస్‌లో 20శాతం వరకు స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్పు చేసుకోవచ్చాన్నారు. కళాశాల ఏర్పాటు అయి 14 ఏండ్లు పూర్తి చేసుకుందని చెప్పారు. కళాశాలకు అటానమస్ రావడంతో అందరి బాధ్యత పెరిగిందన్నారు. రాష్ట్రంలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగు కళాశాలలకు ఏ ప్లస్ గుర్తింపు రావడంతో అందులో కేజీరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల కూడా ఉందని చెప్పారు. కళాశాలకు ఎన్బీఏ అక్రిడిటేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకోవడం జరిగిందని తెలిపారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జాగీర్దార్, అరిస్టాటిల్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఏవో రవికిరణ్‌రెడ్డి ఉన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
Mouni Roy | గ్లామర్ డోస్ పెంచిన మౌనీ రాయ్.. రెడ్ డ్రెస్‌లో అందాల విందు!
King | ‘కింగ్’ ఓవర్సీస్ హక్కులు రూ.175 కోట్లు.. భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు!
మద్యం తాగేందుకు వెళ్లి.. విద్యుదాఘాతంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం’ జోరు.. 24 గంటల్లోనే 2.14 లక్షలకు పైగా టికెట్లు అమ్మకం!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

