గెలుపెవరిదీ !
బెట్టింగ్.. బెట్టింగ్.. బెట్టింగ్.. రెండు తెలుగు రాష్ర్టాల్లో పార్లమెంటు ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్ నడుస్తున్నది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై భారీ బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. ఎక్కడ చూసినా బెట్టింగ్లపైనే చర్చ నడుస్తున్నది.
- ఎలక్షన్ కౌంటింగ్ వేళ జోరుగా బెట్టింగులు
- ప్రముఖులు నిలుచున్న చోట్లపై అమితాసక్తి
- ఎక్కడ చూసినా విజయం ఎవరిని వరిస్తుందన్న చర్చే
పెద్దఅంబర్‌పేట, జూన్ 2 : బెట్టింగ్.. బెట్టింగ్.. బెట్టింగ్.. రెండు తెలుగు రాష్ర్టాల్లో పార్లమెంటు ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్ నడుస్తున్నది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై భారీ బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. ఎక్కడ చూసినా బెట్టింగ్లపైనే చర్చ నడుస్తున్నది.
తమ అభిమాన నాయకుడే గెలుస్తాడని కొందరు, లేదు తమ అభిమాన నేతకే జనం పట్టం కడతారని మరికొందరు పందేలకు దిగుతున్నారు. ‘అన్న రూ.50 వేలు పెట్టిన.. ఆ పార్టీ గెలిస్తే రూ.లక్ష వొస్తదే’ గెలుస్తట్టున్నమా అని ఆరా తీస్తున్నారు. ‘కాక.. అప్పటికి ఇప్పటికి ఏమైనా మారిందా? మారితె చెప్పే.. ఆ పార్టీ మీద ఇంకో లక్ష ఏస్త’ ఇప్పటికే పందెం కాసిన డబ్బు పోకుండా ప్రత్యర్థి పార్టీపై బెట్టింగ్ పెట్టేందుకు సిద్ధమై విశ్లేషణలు చేస్తున్నవారూ కనిపిస్తున్నారు.
ఎన్నికల ముందు నుంచే..
ఎన్నికల నిర్వహణకు రెండు నెలల ముందు నుంచే బెట్టింగ్‌లు మొదలయ్యాయి. ఏపీలో అధికారంలో ఉన్న పార్టీనే మళ్లీ పీఠం దక్కించుకుంటుందని రూ.50 వేలు పెడితే.. కౌంటింగ్ తర్వాత అంతకు రెట్టింపుగా అంటే రూ.లక్ష వచ్చేలా పందేలు కాశారు. లేదు కూటమి పార్టీ గెలుస్తుందని ఇంకొందరు బెట్టింగ్‌లు పెట్టారు. అందుకోసం ముఖ్యమైన నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి, ఓటింగ్ శాతం పెరిగిందా? తగ్గిందా? తగ్గితే ఎవరికి నష్టం? పెరిగితే ఎవరికి కలిసొస్తుంది ఇలా అన్ని రకాల లెక్కలు వేసుకుంటున్నారు.
ఏ నేత ఎవరితో కలిశారు, అది ఎలా లాభం చేకూరుతుందో ఎవరికి వారే విశ్లేషణలు చేసుకున్నారు. ఏపీలో తమకు తెలిసిన వారికి ఫోన్లు చేస్తూ, గెలుపోటములపై చర్చలు నడిపిస్తూనే ఉన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంతోపాటు హైదరాబాద్ శివారులోని పలు నియోజకవర్గాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఓటేసేందుకు ఏపీకి తరలివెళ్లారు. ఈ ఓటరు ఏ పార్టీకి ఓటు వేస్తాడు? అన్న సందేహాన్ని తీర్చుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేశారు. ఓటేసి వచ్చిన తెలిసినవాళ్లందరినీ పార్టీల గెలుపోటములపై వాకబు చేశారు.
ఎంపీ ఎన్నికలపై ఆసక్తి తక్కువే..
రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గత ఎన్నికలతో పోలిస్తే అన్ని పార్టీల ప్రచారం కూడా కొంచెం తక్కువే జరిగింది. ఎన్నికలకు వారం ముందే ప్రచారం వేడెక్కింది. ఆ తర్వాత ఎన్నికలు జరిగినా.. ఈ ఎలక్షన్స్‌పై బెట్టింగులు తక్కువే అని చెప్పాలి. రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచిన నేతలు పోటీలో ఉన్న పార్లమెంటు నియోజకవర్గాలపై కొందరు బెట్టింగులు పెట్టారు. తమ పార్టీ అభ్యర్థులే గెలుస్తారని దీమాతో పందేలకు దిగారు. ఎమ్మెల్యే ఎన్నికలతో పోలిస్తే పార్లమెంటు ఎన్నికల్లో ఈ ప్రభావం, జోరు తక్కువే అని చెప్పాలి.
ప్రముఖులు పోటీ చేసిన వాటిపై..
మున్సిపాలిటీ ప్రజలే కాదు, జిల్లాలోని చాలామంది ఏపీలోని పలు నియోజకవర్గాల్లో ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హాట్ టాపిక్ అయిన, ప్రధాన అభ్యర్థులు, ప్రముఖులు పోటీ చేసిన చాలా నియోజకవర్గాలపై ఇక్కడ పల్లెల్లోనూ బెట్టింగులకు దిగుతున్నారు. ‘అన్నా.. ఏమంటవే. ఏది గెలుస్తది. బెట్టు కట్టిన.. వొస్తయంటవా పైసల్’ అంటూ తెలిసినోళ్లకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. మరికొందరు టీవీలో చర్చలు, యూట్యూబుల్లో విశ్లేషణలు తదేకంగా చూసేస్తున్నారు.
సర్వేల్లో ఫలితాల కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అందులో ముఖ్యంగా ప్రముఖ హీరో పవన్‌కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం, హీరో బాలకృష్ణ బరిలో నిలిచిన హిందూపురం, టీడీపీ అధినేత కొడుకు లోకేష్ పోటీ చేసిన మంగళగిరి, కుప్పం, పులివెందుల, కడప ఇలా మరెన్నో నియోజకవర్గాల్లో ఫలితాలపై ఆసక్తిగా ఉన్నారు. అక్కడ ఎవరు గెలుస్తారు, ఎంత మెజారిటీ వస్తుంది, ఎలా సాధ్యమైంది ఇలా పలు అంశాలపై విశ్లేషణలు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో గెలుపోటములపైనా ఇక్కడ బెట్టింగ్‌లు పెడుతున్నారు. ఈ బెట్టింగుల ఫలితాలకు మరో రెండు రోజుల్లో ఫుల్స్టాప్ పడనున్నది.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CPM | తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం రూ.50 వేల కోట్లు నష్టపరిహారంగా అందించాలి : సీపీఎం
YCP Letter | ఏపీలో పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ
Ramayana | పాకిస్తాన్‌లోనూ తగ్గేదేలే అంటున్న ‘రామాయణ’ క్రేజ్.. కరాచీ వీడియో వైరల్!
TVK leader arrested | వర్షంలో లిఫ్ట్ ఇచ్చే నెపంతో.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన టీవీకే నేత
మేఘ్య తండా- గoగ్లీ బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

