రాడార్ ఆపకుంటే రణరంగమే..
ఒకపక్క స్థానికుల నిరసనలు.. మరో పక్క పర్యావరణ వేత్తల హెచ్చరికలు.. అయినా కాంగ్రెస్ ప్రభుత్వ ధోరణి మారలేదు.. ఎవ్వరి అభిప్రాయాలు పట్టించుకోకుండా దామగుండంలో నేవీ రాడార్ ప్రాజెక్టుకు మంగళవారం శంకుస్థాపన చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.
- కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తున్న దామగుండం పరిసర ప్రాంతాల ప్రజలు
- ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటున్న దామగుండం పరిరక్షణ జేఏసీ
- ఈసీ, మూసీ నదులకు ప్రమాదమంటున్న పర్యావరణ వేత్తలు
- ‘నేవీ రాడార్’ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయడంపై స్థానికుల ఆగ్రహం
- కోర్టుకు వెళ్లి స్టే తెస్తామంటున్న పరిరక్షణ సమితి
- లక్షల చెట్ల నరికి వేతపై స్థానికుల ఆందోళన
- రేడియేషన్ ప్రభావం ప్రజల్లో భయం.. భయం..
- ఇప్పటికే ఊరూరా పోస్టుకార్డు ఉద్యమం చేస్తున్న ప్రజలు
- ప్రాజెక్టు ఆపేదాకా పోరాడుతామంటున్న స్థానికులు
వికారాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) ; ఒకపక్క స్థానికుల నిరసనలు.. మరో పక్క పర్యావరణ వేత్తల హెచ్చరికలు.. అయినా కాంగ్రెస్ ప్రభుత్వ ధోరణి మారలేదు.. ఎవ్వరి అభిప్రాయాలు పట్టించుకోకుండా దామగుండంలో నేవీ రాడార్ ప్రాజెక్టుకు మంగళవారం శంకుస్థాపన చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. లక్షల చెట్లు నరికివేస్తారని, అడవి నామరూపాలు లేకుండా పోనున్నదని స్థానికులు వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. రేడియేషన్ ప్రభావంపై భయపడుతున్నా సమాధానమిచ్చేవారే లేరు. ఈ ప్రాజెక్టు వల్ల ఈసీ, మూసీ నదులు ఉనికి కోల్పోతాయని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నా ప్రభుత్వానికి పట్టింపులేదు. పదేండ్ల క్రితమే రాడార్ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించినప్పటికీ ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పెండింగ్‌లో పెట్టింది..
కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాడార్ కేంద్రం ఏర్పాటు కోసం 2900 ఎకరాల అటవీ భూములను నేవీకి అప్పగించింది.. ఈ భూముల్లో లక్షా 93 వేల చెట్లతోపాటు 400 ఎకరాల్లో గడ్డి భూములు ఉన్నాయి. వీటితోపాటు 500 ఏండ్లనాటి దామగుండం రామలింగేశ్వరస్వామి ఆలయం. లక్షల కోట్ల విలువైన ఔషధ మొక్కలు, 258 రకాల పక్షిజాతులు ఉన్నాయి. రక్షణశాఖ అవసరాలకు తాము వ్యతిరేకం కాదని, కానీ అడవిని నరికివేసి ప్రకృతి విధ్వంసం చేయడాన్ని తాము నిరసిస్తున్నామని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కోర్టుకు వెళ్లి అడ్డుకుని తీరుతామని ‘సేవ్ దామగుండం’ పేరిట ఉద్యమం చేస్తున్న దామగుండం అటవీ పరిరక్షణ జేఏసీ సభ్యులు తెలిపారు. తమ ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోకపోతే అనేక రూపాల్లో నిరసనలు ఉధృతం చేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
అడవిని నరికి మా పొట్ట కొట్టొద్దు..
చుట్టుపక్కల గ్రామాలకు ఉపాధిని కల్పించే అడవిని నరికి మా పొట్టకొట్టొద్దు. నేవీ రాడార్ స్టేషన్ మాకొద్దు.. బరాబర్ కొట్లాడుతాం. ఈ ప్రాంతాన్ని కలుషితం చేసి మా ప్రాణాలమీదకు తీసుకొస్తరా.. కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకిచ్చింది. ప్రజలను పట్టించుకోరా.. ఎంతో పురాతనమైన దామగుండ రామలింగేశ్వరస్వామి ఆలయం ఏమి కావాలె. లక్షల చెట్లను నరికివేసి మమ్మల్ని రోగాలపాలుజేస్తరా.
– రాంచంద్రయ్య, పూడూరు గ్రామం
నేవీ రాడార్ వద్దే వద్దు..
రామలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంతంలో నేవీ రాడార్ నిర్మాణం వద్దే వద్దు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యంపై చింత లేదు. రోగాలబారిన పడితే ఎలా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలు తీస్తాయా..? నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదు. ప్రభుత్వాలు పునరాలోచన చేయాలి.
– పీ సతీశ్ పంతులు, పూడూరు గ్రామం
రాడార్‌ను విరమించుకోకుంటే ఊరుకోం..
నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు వల్ల రేడియేషన్‌తో రాబోయే తరాలకు అన్యాయమే. వాతావరణం కలుషితమై వ్యాధులొస్తాయని మేధావులు, పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. అమెరికా వంటి దేశంలో రాడార్‌ను తొలగించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకొప్పుకున్నది. రాడార్ నిర్ణయాన్ని విరమించుకోకుంటే ఊరుకునేది లేదు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. రాబోవు రోజుల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతాం.
– చాకలి బుచ్చయ్య, పూడూరు గ్రామం
కాంగ్రెస్ వచ్చింది.. కష్టాలు తెచ్చింది..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల బాగోగులను ఆలోచించి రాడార్ ఏర్పాటుకు ఒప్పుకోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ ప్రాంత ప్రజలకు కష్టాలు వచ్చాయి. పూడూరు, తిర్మలాపూర్, గూడుపల్లి, టేకులబిడ్ తండా, సోమన్గుర్తి తదితర గ్రామాల ప్రజలు ఈ అడవిలో మేకలు, పశువులను మేపుకొంటూ జీవనం కొనసాగిస్తాం. నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు రద్దు కోసం తెగించి కోట్లాడుతాం.
– సీహెచ్ పాండు, పూడూరు గ్రామం
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eligible Graduate | అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలి
Water Wastage | మరి ప్రభుత్వానికి ఎవరు ఫైన్ వేయాలి.. ? ఎస్ఆర్ నగర్లో నీటి వృధాపై యువకులు.. వీడియో
ఎంజీయూ విద్యార్థినికి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ ఆర్థిక సాయం
‘మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి’
Srinivas Goud | ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం కరువు జిల్లాగా ప్రకటించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

